జూబ్లీహిల్స్ ప్రచార హోరు.. కాంగ్రెస్ జోరు.!
కల్వకుర్తి అక్టోబర్ 28 పున్నమి న్యూస్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మొన్న మంత్రి పొన్నం ఆటోలో ప్రయాణిస్తూ, మంత్రి సీతక్క ఆటోలో ప్రయాణిస్తూ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మంగళ వారం బట్టలు ఇస్త్రీ చేస్తూ ప్రచారంలో అందరినీ ఆకర్షించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత నాలుగు రోజుల నుండి ప్రచారంలో పాల్గొంటూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతున్నారు.


