*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
లంచం తీసుకొంటూ ఎ.సి.బి. కి చిక్కిన భీమిలి మున్సిపల్ కార్పోరేషన్ జోన్ – 1 ఉద్యోగులు
విశాఖపట్నం జిల్లా తగరపువలస గ్రామానికి చెందిన పిన్నింటి దుర్గారావు, అతని తాత గారి పేరుమీద మునిసిపల్ రికార్డులలో వున్న ఇంటి పన్ను అసెస్ మెంట్ ను మార్చి, దాని స్థానంలో అతని భార్య మరియు మరదలు పేరును చేర్చవలసినదిగా కోరుచూ, అన్ని ఆధారాలతో, భీమిలి మునిసిపల్ కార్పోరేషన్, జోన్-1 కార్యాలయానికి దరఖాస్తు చేసుకోగా, ఆ దరఖాస్తును ప్రాసెస్ చేసి, వారి పేర్లమీద ఇంటి పన్ను అసెస్ మెంట్ ను మార్చడానికి గాను గాను, అదే కార్యాలయంలో రెవిన్యూ ఇన్స్ పెక్టర్ గా పనిచేయుచున్న ముగడ రాజు మరియు బొగ్గు రోడ్డు – 2 వార్డు సచివాలయంలో టాక్స్ కలెక్టర్ మరియు వార్డ్ అడ్మిన్ సెక్రటరి గా పనిచేయుచున్న ఎర్నింటి స్వామి నాయుడులు, అతని వద్దనుండి రూ.60,000/-లు లంచంగా డిమాండ్ చేసినారు. సదరు దుర్గారావు అంత ఇచ్చుకోలేనని అనగా, అయితే రూ. 50,000/- లు అయినా ఇవ్వమన్నారు. అయితే సదరు దుర్గారావుకు ఆ లంచం డబ్బులు కూడా ఇవ్వడం ఇష్టం లేక, ప్రస్తుతం తన వద్ద అన్ని డబ్బులు లేవని అనగా, అయితే ప్రస్తుతం రూ.30,000/- ఇవ్వు, మిగిలిన రూ. 20,000/- పని అయిపోయిన తరువాత ఇద్దువుగాని అని అన్నారు. అయితే సదరు దుర్గారావుకు ఆ డబ్బులు కూడా ఇవ్వడం ఇష్టంలేక సదరు ఇద్దరు అధికారులపై తగుచర్య తీసుకోవలసినదిగా కోరుచూ విశాఖపట్నం ఎ.సి.బి అధికారులకు రిపోర్టు ఇవ్వగా, వారు ఆ రిపోర్టు ను వారి ఆఫీసు క్రైం. నెం. 8/RCT-RJY/2025, అవినీతి నిరోధక (సవరణ) చట్టం 2018 సెక్షన్ 7 (a) క్రింద కేసు నమోదు చేసి, సదరు అధికారులు ఇద్దరూ ఆ లంచం డబ్బులు రూ.30,000/- లను ఫిర్యాదు దారుని వద్దనుండి ఈ రోజు అనగా తేది. 27.10.2025 నాడు, తీసుకొంటుండగా, వారివురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, అరెస్టు చేసినారు.
అరెస్టు కాబడిన వారివురిని రేపు అనగా మంగళవారం నాడు విశాఖపట్నం లోని ఎ.సి.బి. ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలలో జరుగుచున్న అవినీతిని గురించి ఎవరైనా సంభందిత జిల్లా ఎ.సి.బి అధికారులకు కాని లేదా ఎ.సి.బి టోల్ ఫ్రీ నెంబరు 1064 లేదా ఎ.సి.బి మొబైల్ నెం. 94404 40057 కు కాని లేదా ఎ.సి.బి ఈ-మెయిల్ ఐ.డి. నెం. complaints-acb@ap.gov.in కు కానీ తెలియపరచవచ్చు.


