అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:21
జరుగుతున్న కొన్ని ఘటనలు పట్టణాల విష సంస్కృతి పల్లెలకు ప్రకుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. అరకులోయ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం అరకు క్రీడా పాటశాలలో 9వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్ధి ని ఓ అగంతుకుడు గొంతు కోసి పరారయ్యాడు. దీంతో గాయపడిన విద్యార్ధిని తోటి విద్యార్ధులు అరకు ఏరియ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఏరియ ఆసుపత్రిలో గాయపడిన మైనర్ విద్యార్ధికి త్వరగా చికిత్స అందడంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. క్రీడా పాటశాల ప్రిన్సిపాల్ పీఎస్ఎన్ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం… క్రీడా పాటశాల కు చెందినా నలుగురు విద్యార్ధులు పాటశాల నిర్వాహకుల అనుమతితో దీపావళి రోజున అరకులోయ కు వచ్చి, తిరిగి పాటసాలకు వస్తున్నా సమయంలో వారికి పరిచయం లేని వ్యక్తీ విద్యార్ధులను డబ్బులు అడగగా వారి వద్ద లేవని తెలపడంతో, డబ్బులు లేవన్నందుకు విద్యార్ధులతో వాగ్వాదానికి దిగి ఆగంతుకుడు తన దగ్గర ఉన్న బ్లేడుతో మైనర్ విద్యార్ధి గొంతు కోసి పరారైనట్లు తెలిపారు. దీంతో గాయపడిన మైనర్ విద్యార్ధిని తోటి స్నేహితులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో కోలుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

మైనర్ విద్యార్ధి గొంతు కోసిన అగంతకుడు
అరకులోయ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:21 జరుగుతున్న కొన్ని ఘటనలు పట్టణాల విష సంస్కృతి పల్లెలకు ప్రకుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. అరకులోయ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం అరకు క్రీడా పాటశాలలో 9వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్ధి ని ఓ అగంతుకుడు గొంతు కోసి పరారయ్యాడు. దీంతో గాయపడిన విద్యార్ధిని తోటి విద్యార్ధులు అరకు ఏరియ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఏరియ ఆసుపత్రిలో గాయపడిన మైనర్ విద్యార్ధికి త్వరగా చికిత్స అందడంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. క్రీడా పాటశాల ప్రిన్సిపాల్ పీఎస్ఎన్ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం… క్రీడా పాటశాల కు చెందినా నలుగురు విద్యార్ధులు పాటశాల నిర్వాహకుల అనుమతితో దీపావళి రోజున అరకులోయ కు వచ్చి, తిరిగి పాటసాలకు వస్తున్నా సమయంలో వారికి పరిచయం లేని వ్యక్తీ విద్యార్ధులను డబ్బులు అడగగా వారి వద్ద లేవని తెలపడంతో, డబ్బులు లేవన్నందుకు విద్యార్ధులతో వాగ్వాదానికి దిగి ఆగంతుకుడు తన దగ్గర ఉన్న బ్లేడుతో మైనర్ విద్యార్ధి గొంతు కోసి పరారైనట్లు తెలిపారు. దీంతో గాయపడిన మైనర్ విద్యార్ధిని తోటి స్నేహితులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో కోలుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

