అమలాపురం, అక్టోబర్ 21 (తూర్పు ఉదయం విలేఖరి) : మండలంలోని
బండారులంకలో గత 15 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ గా ఉన్న 40 సెంట్ల భూమిలో గత సంవత్సర కాలం నుంచి అక్కడ చెత్త వేయకుండా తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకు రాజకీయం చేసి చెత్త వేయకుండా ఆపింది బండారులంక కూటమి నాయకులేనని…. కాబట్టి ఈ సమస్య పరిస్కరించవలసిన బాధ్యత స్థానిక కూటమి నేతలపైనే ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు జానా జగదీశ్ చంద్ర గణేష్ పేర్కొన్నారు.బండారులంకలో తక్షణమే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి, చెత్తను తరలించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం ఆరో రోజుకి చేరుకున్నాయి.ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుత్తుల ఏసుబాబు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త చందన శంకర్రావు లు మాట్లాడుతూ ఇప్పుడు స్థానిక కూటమి నాయకుల పరిస్థితి ఎవరు తీసుకున్న గోతిలో వారే పడిన చందంగా మారిందన్నారు.. బండారులంక పంచాయతీకి ఉత్తమ సంస్థ అవార్డు రావడం తీవ్ర హాస్యాస్పదమని ఇప్పుడున్న పరిస్థితుల్లో బండారులంక ఉత్తమ చెత్త పంచాయతీగా నిలుస్తుంది అన్నారు.
ఈరోజు జరిగిన దీక్షలో గంటి కామేశ్వరరావు, కందనాల పుల్లయ్య, ఇనుమర్తి నాగేశ్వరరావు,బిళ్ళ నంది సుబ్రహ్మణ్యం, బళ్ళ శేఖర్, కామిశెట్టి వెంకటేశ్వరరావు, ములికి సాయి, ఊటుకూరి దిలీప్,ఏకుల సాంబమూర్తి మరియు 5 వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.వీరికి గ్రామంలోని పెద్దలు పేరి రాంబాబు, పేరి భానుమూర్తి, చందన శంకర్రావు,గుత్తుల ఏసుబాబు సరేళ్ళ రామకృష్ణ, కామిశెట్టి శ్రీనివాసరావు, దంగేటి సత్తిపండు,చింతా ఉమా మహేశ్వర రావు,కాలెపు శ్రీనివాసరావు, కొండా తాతారావు, చింతా పల్లపరాజు,గుమ్మిడి పుల్లయ్య,గుత్తుల సత్తిబాబు, దంగేటి వెంకట శెట్టి, దొమ్మేటి బాబ్జి,కోరుకూరి వీరబాబు, గిడ్ల శ్రీను, ఊటుకూరి సుబ్రహ్మణ్యం,దంగేటి మహేష్, గుమ్మిడి వెంకన్న, దంగేటి మురళి, బొక్కా రమేష్, కుడిపూడి శ్రీధర్, లక్కింశెట్టి మల్లికార్జున, చింతా ఉమామహేశ్వరరావు, గోళ్ళ లింగయ్య, మాడా శివ రామకృష్ణ, జాన కామేశ్వరరావు, ఇనుమర్తి లింగమూర్తి, కారుపర్తి మల్లేశ్వరరావు, పిచ్చిక కేశవ,ఆశపు రేణుకా ప్రసాద్, గుమ్మిడి బోస్, లక్కింశెట్టి సత్యనారాయణ తదితరులు సంఘీభావం తెలిపారు.

బండారు లంక లో చెత్త సమస్యకు కూటమి నాయకులే కారణం
అమలాపురం, అక్టోబర్ 21 (తూర్పు ఉదయం విలేఖరి) : మండలంలోని బండారులంకలో గత 15 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ గా ఉన్న 40 సెంట్ల భూమిలో గత సంవత్సర కాలం నుంచి అక్కడ చెత్త వేయకుండా తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకు రాజకీయం చేసి చెత్త వేయకుండా ఆపింది బండారులంక కూటమి నాయకులేనని…. కాబట్టి ఈ సమస్య పరిస్కరించవలసిన బాధ్యత స్థానిక కూటమి నేతలపైనే ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు జానా జగదీశ్ చంద్ర గణేష్ పేర్కొన్నారు.బండారులంకలో తక్షణమే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి, చెత్తను తరలించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం ఆరో రోజుకి చేరుకున్నాయి.ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుత్తుల ఏసుబాబు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త చందన శంకర్రావు లు మాట్లాడుతూ ఇప్పుడు స్థానిక కూటమి నాయకుల పరిస్థితి ఎవరు తీసుకున్న గోతిలో వారే పడిన చందంగా మారిందన్నారు.. బండారులంక పంచాయతీకి ఉత్తమ సంస్థ అవార్డు రావడం తీవ్ర హాస్యాస్పదమని ఇప్పుడున్న పరిస్థితుల్లో బండారులంక ఉత్తమ చెత్త పంచాయతీగా నిలుస్తుంది అన్నారు. ఈరోజు జరిగిన దీక్షలో గంటి కామేశ్వరరావు, కందనాల పుల్లయ్య, ఇనుమర్తి నాగేశ్వరరావు,బిళ్ళ నంది సుబ్రహ్మణ్యం, బళ్ళ శేఖర్, కామిశెట్టి వెంకటేశ్వరరావు, ములికి సాయి, ఊటుకూరి దిలీప్,ఏకుల సాంబమూర్తి మరియు 5 వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.వీరికి గ్రామంలోని పెద్దలు పేరి రాంబాబు, పేరి భానుమూర్తి, చందన శంకర్రావు,గుత్తుల ఏసుబాబు సరేళ్ళ రామకృష్ణ, కామిశెట్టి శ్రీనివాసరావు, దంగేటి సత్తిపండు,చింతా ఉమా మహేశ్వర రావు,కాలెపు శ్రీనివాసరావు, కొండా తాతారావు, చింతా పల్లపరాజు,గుమ్మిడి పుల్లయ్య,గుత్తుల సత్తిబాబు, దంగేటి వెంకట శెట్టి, దొమ్మేటి బాబ్జి,కోరుకూరి వీరబాబు, గిడ్ల శ్రీను, ఊటుకూరి సుబ్రహ్మణ్యం,దంగేటి మహేష్, గుమ్మిడి వెంకన్న, దంగేటి మురళి, బొక్కా రమేష్, కుడిపూడి శ్రీధర్, లక్కింశెట్టి మల్లికార్జున, చింతా ఉమామహేశ్వరరావు, గోళ్ళ లింగయ్య, మాడా శివ రామకృష్ణ, జాన కామేశ్వరరావు, ఇనుమర్తి లింగమూర్తి, కారుపర్తి మల్లేశ్వరరావు, పిచ్చిక కేశవ,ఆశపు రేణుకా ప్రసాద్, గుమ్మిడి బోస్, లక్కింశెట్టి సత్యనారాయణ తదితరులు సంఘీభావం తెలిపారు.

