విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు నిర్వహించిన కార్యవర్గ సభ్యులు.. విశాఖపట్నం : సమాజంలో పాతుకుపోతున్న చెడు, అవినీతిని అంతమందించేందుకు జర్నలిస్టులు తమ కలాన్ని ఝాళిపించాలని జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా శాఖ అధ్యక్షులు కే.ఎం. కీర్తన్ పిలుపునిచ్చారు. విశాఖ సెంట్రల్ పార్క్ లో జాప్ విశాఖ శాఖ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులకు దీపావళి సందర్భంగా మిఠాయిలు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాప్ విశాఖ శాఖ అధ్యక్షులు కీర్తన్ మాట్లాడుతూ చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగను జరుపుకుంటామన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాత్రికేయులు సమాజంలోని చెడు, అవినీతిని పారద్రోలేందుకు కృషి చేయాలని కోరారు. పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ సమాజ సంక్షేమానికి పనిచేయవలసిన బాధ్యత పాత్రికేయులుగా మనపై ఉందని చెప్పారు. సభ్యులందరి కుటుంబాల జీవితాల్లో లక్ష్మీదేవి కరుణించి వెలుగుల నింపాలని ఆయన ఆకాంక్షించారు. కార్యవర్గ సభ్యుల సహకారంతో మరికొన్ని రోజుల్లో తమ యూనియన్ సభ్యులకు ఇన్సూరెన్స్ పాలసీని కట్టే ఆలోచనలో ఉన్నామని కీర్తన్ స్పష్టం చేశారు. జాప్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జెవికె అప్పలరాజు మాట్లాడుతూ యూనియన్ సభ్యులకు మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ కార్యవర్గం ప్రయత్నిస్తుందని చెప్పారు. సభ్యులందరికీ సహకారంతో రాబోయే రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. జాప్ విశాఖ విశాఖ అధ్యక్షులు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి అప్పలరాజు జన్మదిన వేడుకలను నిర్వహించారు. సభ్యుల సమక్షంలో కేకును కట్ చేసి పరస్పరం తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాప్ విశాఖ శాఖ ప్రతినిధులు
గంట చంద్రశేఖర్ వి ఉదయ్ కుమార్, కే పృథ్వీరాజ్ వై.యస్ సాయికుమార్, పి .అర్జున్, ఎస్ రామకృష్ణ, , ఎస్. ఎన్. నాయుడు, ఆర్. శ్రీనివాసరావు, జి రాజు, కే .శంకర్ , వల్లి, సురేష్, జి సతీష్, జి. శ్రీనివాస్, శ్రీనివాస్, ప్రసాద్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాలకు చెందిన జర్నలిస్టులు, ఫోటో వీడియో జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.


