తేదీ:-19-10-2025
నరసన్నపేట పట్టణం అక్టోబర్ పున్నమి ప్రతినిధి




విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండే విద్యలో రాణించగలిగితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడం జరుగుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారు తెలిపారు. ఆదివారం నరసన్నపేట ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో జిల్లా ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఉన్నత చదువులను బోధించవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పరంగా ప్రైవేటు పాఠశాలలో చదివిన అన్ని విధాల ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది విద్యార్థులకు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ జిల్లా, మండల స్థాయి సభ్యులు పాల్గొన్నారు.

