ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
మనుబోలు మండలంమండలం కాగితాలపూరు క్రాస్ రోడ్లోని పంజాబీ డాబా పక్కనే ఉన్న పొదల్లో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. జట్లకొండూరుకు చెందిన కసుమూరు రమేశ్ (18) వేప చెట్టుకు ఉరి వేసుకుని ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్సై శివ రాకేశ్ ఘటనా స్థలానికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

