*✍️వీకేఆర్.వై కాలనీలో ఆగని ఆక్రమణలు. కొనసాగుతున్న అక్రమ కట్టడాలు*
*రెవెన్యూ హెచ్చరిక పెట్టిన బోర్డును రాత్రికి రాత్రి బోర్డు పెకలించి మట్టి తోలిన భూబకాసురులు*
👉 *చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు*
👉 తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం చిన్న పాండురు పంచాయతీ వి కే ఆర్ వై గిరిజన కాలనీ వద్ద అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల వి కె ఆర్ వై గిరిజన కాలనీ ప్రాథమిక పాఠశాల సమీపంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు.. అయితే తాసిల్దార్ కు అందిన ఫిర్యాదుల మేరకు పనులను నిలుపుదల చేసి రెవిన్యూ అధికారుల ద్వారా బోర్డు పెట్టించారు
👉. తాజాగా వికేఆర్వై కాలనీ కూడలి నుండి హీరో పరిశ్రమకు వెళ్లే మార్గంలో కుడిచేతివైపుగా ఉన్న కొబ్బరి బోండా కొట్టు ను రాత్రి వేళలో అక్రమంగా ఇంటి స్థలాన్ని ఓ కబ్జాదారుడు నిర్మాణాలను దర్జాగా చేపడుతున్నారు.
ఈ ఆక్రమణదారులకు కొందరు
దళారులుగా ఉంటూ కమిషన్లు తీసుకుని రెవెన్యూ అధికారులకు కాసులు అందిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతోంది
👉 ఈ నేపధ్యంలో ఇంత జరుగుతున్నా..నియంత్రింల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వారు వ్యవహరిస్తుఉండటం ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది..అంతేగాక పట్టపగలే నిర్మాణాలు జరుగుతున్నా.. రెవిన్యూ అధికారుల నుండి ఏమాత్రం స్పందన లేదు.
👉అక్రమ నిర్మాణాలను ఆక్రమణలను అడ్డుకునేందుకు రెవెన్యూ అధికారులు ఇద్దరు సిబ్బందిని అక్కడే ఉండి పర్యవేక్షించాలని ఆదేశించిన.. అక్రమ నిర్మాణాలు సాగుతుండటంతో రెవెన్యూ అధికారుల అండదండలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతోంది
👉 ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి గ్రామస్థాయిలో ఇలాంటి భూకబ్జాదారుల్ని నియంత్రించాలని కోరుతున్నాను.
సూర్య
పున్నమి రిపోర్టర్
సత్యవేడు నియోజకవర్గం


