లకాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు ఈగల మోహన్ సాయి, వంటాకు వినోద్ ఆధ్వర్యంలో మద్దిలపాలెం, కృష్ణ కాలేజీ రోడ్డులో ఏఐసీసీ పిలుపు మేరకు రాహుల్ గాంధీకి మద్దతుగా ఓట్ చోర్, గద్దె చోడ్ అని నినాదాలు ఇస్తూ బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి చేస్తున్న కుట్రని ప్రజలకు వివరిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం చేసారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి పాల్గొని దేశంలో ఈసీ సహాయంతో బీజేపీ ఓట్ చోర్ చేసి అధికారంలోకి వస్తోందని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు చేస్తోందని ఆమె అన్నారు, బీజేపీకి బలం లేని రాష్ట్రాల్లో మిత్రపక్షలకు పూర్తిగా సహకరిస్తూ ఓట్ చోరీ చేసి అధికారం కైవసం చేసుకుంటున్నారని, మన రాష్ట్రంలో బీజేపీకి 0.5% ఓట్ బ్యాంకు మాత్రమే ఉందని కాని గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 8 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుందని, రాయలసీమలో ధర్మవరం, ఉత్తరాంధ్రలో ఇచ్చాపురంలో బీజేపీ గెలవడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఓట్లు చోరీ చేసి, ఎన్నికలను చోరీ చేసి బీజేపీ గెలుస్తోందని, ప్రజా స్వామ్యాన్ని, ప్రజల హక్కులను బీజేపీ కాల రాస్తోందని. ఇప్పటికే దేశ వ్యాప్తంగా యువత మోదీ అంటే ఓట్ చోర్ అని అంటున్నారని. మీ ఓటు జాగ్రత్తగా కాపాడుకోవాలి, బీజేపీ ఎన్నికల సంఘం మీ ఓటు కూడ దొంగలిస్తుందని ప్రజలకు ఆమె హేచ్చరించారు.పారదర్శకంగా ఉండాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం మోదీ జేబు సంస్థగా వ్యవహారిస్తోందని, బెంగళూరులో ఒక అసెంబ్లీ నియోజకవర్గం మహాదేవపురా లోనే లక్ష ఓట్లు దొంగ ఓట్లు ఉన్నట్టు తెలిందని, ఇది ఎన్నికల సంఘానికి తెలియకుండా జరిగిందా? బీజేపీ చెప్పినట్టు ఎన్నికల సంఘం ఆడుతోందని ప్రియాంక విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా నాయకురాలు కాండవ గాయత్రి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ ఆలీ, 15 వ వార్డు అధ్యక్షులు వేమూరి సురేష్, 27 వ వార్డు అధ్యక్షులు గుర్రం కనకరాజు, 28 వ వార్డు అధ్యక్షురాలు మామిడి వరాలమ్మ, 18 వ వార్డు అధ్యక్షులు భోగవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వస్తోంది కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి