పున్నమి సెప్టెంబర్ 13 హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పల్స్ పోలియో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. HYDలో 0-5 ఏళ్ల పిల్లలకు 7AM-6PM వరకు ప్రత్యేక బూత్‌లలో, 13వ తేదీ నుంచి 15 వరకు ఇంటింటికి తిరిగి డ్రాప్స్ వేస్తామని కలెక్టర్ హరిచందన తెలిపారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల్లో పోలియో కేసులు పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా 290 జిల్లాల్లో ఈ డ్రైవ్ చేపట్టామని కేంద్రం వెల్లడించింది.
ఒక్క రోజు పిల్లల కోసం కేటాయించండి పోలీయో .. బాడీలో ఏంజరుగుతుందో తెలిసేలోపే అంతా అయిపోతుంది. అంగవైఖల్యం పిల్లల జీవితాన్ని చిదిమేస్తుంది. 2 చుక్కలతో నిండు జీవితాన్ని మహమ్మారి నుంచి రక్షించండి. పనులు పక్కనబెట్టి నేడు ఉ.7గం. నుంచి పోలీయోడ్రాప్స్ వేయించండి. జిల్లాలోని అంగన్వాడీలు, ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులతో సహా 1,151 చోట్ల బూతులు ఏర్పాటుచేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 4,20,911 మంది బాలలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.


