నిర్మల్ అక్టోబర్ 08 (పున్నమి ప్రతినిధి)
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లాలోని అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని, సమాజ సేవ భావం కలిగి ఉండి, నిజాయితీపరులైన అభ్యర్థులకు పార్టీ నుంచి అవకాశం కల్పిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో సామాజిక మార్పు కోసం స్వచ్ఛందంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు ఆమ్ ఆద్మీ పార్టీ స్వాగతం పలుకుతుందన్నారు. పార్టీ జాతీయ పార్టీ కనుక బ్యాలెట్ పేపర్లో మొదటి వరుసలో చీపురు గుర్తు ఉంటుందని, ప్రజల్లో చైతన్యం, సామాజిక మార్పు కోసం పోరాడే వారికీ సామాన్యుల పార్టీగా అవకాశం ఇస్తామన్నారు. పోటీ చేయదలచిన వారు తమ బయోడేటాతో జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. బీ-ఫారం పొందే వారు పార్టీ సభ్యత్వం స్వీకరించడంతో పాటు, గెలిచినా, ఓడినా పార్టీ మారబోనని అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 8106246177 నెంబర్ కు సంప్రదించాలన్నారు.


