కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యానికి ప్రభుత్వం అందిస్తున్న పోషక పదార్థాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. ఆనందపురం మండల కార్యాలయంలో గురువారం నిర్వహించిన 8వ రాష్ట్రీయ పోషక మాసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
గర్భిణీలకు అవసరమైన పోషకాలను శాస్త్రీయంగా ఎంపిక చేసి ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని గర్భిణీలు పూర్తిగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలని సూచించారు.
కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకన్నా ఇలాంటి ఆరోగ్యకార్యక్రమాల్లో పాల్గొనడం ఎక్కువ సంతృప్తిని ఇస్తుందని అన్నారు. అనంతరం ప్రభుత్వం తరపున గర్భిణీలకు సీమంతం నిర్వహించి, ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టాలని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వంచే అందిస్తున్న చిరుధాన్యాల హల్వా, చిక్కి వంటి పదార్థాల నాణ్యతను పరిశీలించి రుచి చూశారు.
కార్యక్రమంలో ఐసీడీఎస్ పీఓ శ్రీదేవి, ఎమ్మార్వో శ్రీనుబాబు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు తాట్రాజు అప్పారావు, కార్పొరేటర్లు పి.వి. నరసింహం, లొడగల అప్పారావు, కూటమి నేతలు చిక్కాల విజయ్ బాబు, బి.ఆర్.బి. నాయుడు, తమ్మిన అప్పలరాజు, శాఖారి శ్రీనివాస్, రెడ్డి బాబు, కర్రి శ్రీనివాసరావు, కె. శ్రీకాంత్ రాజు, బమ్మిడి ఉమ, ఎర్ర రాజు, మహంతి శివాజీ, అప్పలరాము, గండ్రెడ్డి రమేష్, సోమునాయుడు, పాండ్రంగి అప్పలరాజు, బమ్మిడి తారక్ తదితరులు పాల్గొన్నారు.


