

ఎండియూ ఆపరేటర్స్ ను రోడ్డున పడేయటం బాధాకరమని, ఎండియూ ఆపరేటర్స్ అధ్యక్షులు రౌతు.సూర్యనారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జూన్ నెల నుండి ఎండియు వ్యవస్థ రద్దు చేస్తూ మా వెహికల్ సంబంధించి క్లియరెన్స్ ఇస్తామని తెలియజేస్తూ ప్రకటించడం జరిగిందని, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఎండియు వ్యవస్థను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9260 కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని, ఇప్పటికీ ఐదు మాసాలు కావస్తున్నా, మా వెహికల్ యొక్క క్లియరెన్స్ చేయడం జరగలేదని, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మొబైల్ క్యాంటీన్ గా ఉన్న మా వెహికల్స్ను గూడ్స్ క్యారియర్ గా మార్చి పెనాల్టీ మినహాయించి ఫిట్నెస్ చేయించుకునే విధంగా అవకాశం కల్పిస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సర్కులర్ రిలీజ్ చేసినప్పటికీ, ఎటువంటి కార్యచరణ నిర్వహించడం జరగలేదని, 5 నెలలుగా మా వెహికల్స్ ని ఏ పనికి ఉపయోగించుకోకుండా మాకు ఉపాధి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు.
మా యందు దయవుంచి ఉపాధి కోల్పోయిన ఎండియు ఆపరేటర్స్ నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే మా వెహికల్ యొక్క క్లియరెన్స్ చేస్తూ ఎటువంటి పెనాల్టీ లేకుండా వెహికల్ ఫిట్నెస్ చేయించుకున్న విధంగా సర్కులర్ రిలీజ్ చేస్తూ, మా వెహికల్స్ ని మేము వినియోగించుకునే విధంగా చేయాలని వినతి పత్రాన్ని రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డిని కోరగా, సానుకూలంగా స్పందించిన ఆయన, ప్రభుత్వంతో మాట్లాడి మీ సమస్యకు పరిస్కారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎండియూ ఆపరేటర్స్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

