పట్టించుకోని ఆహార భద్రత అధికారులు…
* ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న హోటల్స్ యజమానులు
* కనీసం ఆరోగ్య భద్రత పాటించని వర్కర్లు
తినే పదార్థాలు బాగోలేదని కస్టమర్ హోటల్స్ యజమానులను అడిగితే వారి పైన దాడులకు దిగుతున్న యజమాన్య బృందం
* హోటల్స్ లలో తలకు మించిన ధరలు అడిగేవారే కరువయ్యారు
* కస్టమర్ కు సంబంధించి కనీస సౌకర్యాలు అయిన టాయిలెట్స్ అనేది ఏ హోటల్స్ లో చూసినా ఎక్కడ కనిపించడం లేదు అలాంటి హోటల్స్ యొక్క పర్మిషన్లు రద్దు చేయాలని కస్టమర్ డిమాండ్
రైల్వేటేషన్ పక్కనున్నటువంటి ఆనంద విహార్ హోటల్స్ లో అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్లేట్స్ లలో టిఫిన్ పెట్టడం జరుగుతుంది
ప్లేట్స్ శుభ్రంగా లేదు అని ఆనంద విహార్ క్యాషియర్ ని నిలదీసి అడగ్గా వెంటనే కస్టమర్ చేతిలో ఉన్న ప్లేట్లు లాక్కొని వంటగది రూంలో తీసుకువెళ్లి వేరే ప్లేట్లల్లో టిఫిన్ పెట్టి ఇవ్వడం జరిగింది
ఆనంద విహార్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ నిర్వహించి వెంటనే ఆ హోటల్ లైసెన్స్ ను రద్దు చేయాలని కస్టమర్స్ కోరుకుంటున్నారు
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న టిఫిన్ సెంటర్ హోటల్ మరియు పాస్ట్ ఫుడ్ సెంటర్ల పై అధికారుల నిఘా కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు. పలురకాల మాంసాహార ఐటమ్స్‌తో ఆహార ప్రియులను నట్టేట ముంచుతున్నాయి. ఇష్టానుసారంగా నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి విక్రయిస్తుంటే ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోందని పలువురు మండిపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఆహార పదార్థాల బిజినెస్ ఊపందుకుంటుంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు అనుభవం టిఫిన్ సెంటర్ హోటల్ రెస్టారెంట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ నూనె, కల్తీ ఆహారాన్ని విక్రయస్తూ ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఆహార పదార్థాల విక్రయించే హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పలు దుకాణాలకు, ఆహార భద్రత అధికారుల నుంచి పలు అనుమతులు పొందాలి. అయితే ఈ అనుమతులకు విరుద్ధంగా కొందరు ఇష్టారాజ్యంగా ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని సంపాదనే ధ్యేయంగా నాణ్యతలేని పదార్థాలు విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని పక్కనపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సెంటర్ల పై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వెలువెత్తు తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి హోటల్స్ రెస్టారెంట్ టిఫిన్ సెంటర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


