*
*ప్రజలందరూ కూడా ముందు జాగ్రత్త తో ఇన్సూరెన్స్ చేయించుకోండి ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ చందూలాల్*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ ఎస్బిఐ బ్యాంక్ నందు విద్యానగర్ కాలనీ కి చెందిన దేశభోయిన శ్రీనివాస్ స్కూల్ బస్ క్లీనర్ గా పనిచేస్తున్నారు మూడు నెలల క్రిందట విద్యానగర్ కాలనీ ఎస్బిఐ బ్యాంక్ లో ఎస్బిఐ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 500రూపాయలు చేశారు (ఒక సంవత్సరం ఇన్సూరెన్స్ 500 కట్టాలి) అనుకోకుండా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది ఈ యొక్క ఇన్సూరెన్స్ కి శ్రీనివాస్ భార్య రాజకుమారి నామిని గా ఉంది,రాజకుమారి బ్యాంక్ మేనేజర్ నీ సంప్రదించగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఏజియం సత్యనారాయణ చేతుల మీదిగా పది లక్షల చెక్ రాజకుమారి కి అందించారు ఈ కార్యక్రమములో ఏ.జి.యం సత్యనారాయణ బ్యాంక్ మేనేజర్ చందులాల్ మాట్లాడుతూ ఎస్బిఐ బ్యాంక్ నందు అత్యుత్తమ ఇన్సూరెన్స్ కవరేజులు అందిస్తుంది ప్రజలు ఆదరించండి ఏ టైమ్ లో ఏమి జరుగుతుంది తెలియదు ముందు జాగ్రత్త తో చేయించుకుంటే మీ కుటుంబానికి ఉపయోగపడతాయని బ్యాంక్ నందు ఇన్సూరెన్స్, పాలసీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు
*ఈ కార్యక్రమములో ఫీల్డ్ ఆఫీసర్ తిరుమలేశ్,క్యాష్ ఆఫీసర్ ఇందిరా,అసోసియేట్ కోటేశ్వరి,మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు*


