*పున్నమి ప్రతినిధి కామారెడ్డి- అక్టోబర్ 5*
ఈరోజు ఉదయం 9-30 నుండి కురిసిన భారీ వర్షం కారణంగా చెరువులు, కుంటలు, నిండిపోయి కాలువలన్నీ, వాగులన్నీ విపరీతంగా పారుతున్నాయి. వర్షం నీరు వాగులల్లో ఉధృతంగా పారుతున్నందున వాడి గ్రామం దగ్గర గల వాడు ఉధృతంగా పారుతున్నందున పాల్వంచ చౌరస్తా నుండీ వాడి మీదుగా ఫరీద్ పేట, అంబర్ పేట, బీబీపేటకు నిలూచిపోయి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాడి, ఫరీద్ పేట మధ్యలో గల వాగు దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటుగా వచ్చే వాహనాలను, బస్సులను తిరిగి పాల్వంచ చౌరస్తాకు పంపుతున్నారు.
ఈ బందోబస్తును పాల్వంచ చౌరస్తా దగ్గరనే ఏర్పాటు చేస్తే ఈ వాగు వరకు వచ్చి ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదని ప్రజలు తమ బాధలను వ్యక్తం చేస్తున్నారు. గ్రామ కార్యదర్శి, పోలీసు యంత్రాంగం ముందస్తుగా పాల్వంచ చౌరస్తా వద్దనే వాహనాలను దారి మల్లించాలని కోరుతున్నారు.


