Friday, 27 March 2026
  • Home  
  • అంబరాన్ని తాకిన జనసేన దసరా సంబరాలు. విజయదశమి వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు.
- తూర్పు గోదావరి

అంబరాన్ని తాకిన జనసేన దసరా సంబరాలు. విజయదశమి వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు.

రాజమండ్రి మందు గల జనసేన ఉభయగోదావరి జిల్లాల పార్టీ కార్యాలయంలో ఘనంగా విజయదశమి సంబరాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ , కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ , డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు , మినీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చైర్మన్ వేగుల లీలా కృష్ణ , రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ ప్రియా సౌజన్య , రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి పూల అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిగించారు. అనంతరం జాతిపిత గాంధీ మహాత్మా ఫోటోకు పూదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమాల తాలూకా విజయాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల హృదయాలలో ప్రత్యేక చోటును సంతరించుకున్నాయన్నారు. విశిష్ట అతిథి తంగెళ్ల ఉదయ్ మాట్లాడుతూ ఇటీవల విశాఖలో జరిగిన సమావేశం ప్రకారం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని, ఇప్పటినుండి పార్టీ ముఖ్య నాయకులుగా నెలలో రెండు, మూడు సార్లు వచ్చి వెళ్తూ ఉంటామని, ప్రజలను, కార్యకర్తలను కలిసి లోటుపాట్లు తెలుసుకుని పార్టీకి చదివేస్తామన్నారు. ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ జనసైనికులకు, నాయకులకు, వీర మహిళలకు దశమి శుభాకాంక్షలు తెలిపుతు గత ప్రభుత్వ అరాచకాలు నుండి ప్రజలను కాపాడి మేలు చేస్తున్న కూటమీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని, నూతన ఉత్సాహంతో సాగుతున్న జనసేన నేత మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి నేను రుణపడి ఉంటామన్నారు. ప్రపంచ రాజకీయాల్లో మోడీ తర్వాత ఎక్కువ ప్రజాతరణ పొందిన వ్యక్తి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేనని, అలాంటి వ్యక్తి స్థాపించిన జనసేన పార్టీలో మేము కూడా భాగస్వామ్యం కావడం అందరికీ ఆనందదాయకనన్నారు. పత్తిపాడు జనసేన నాయకులు కత్తిపూడి బాబీ , జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి , కాకినాడ జనసేన నాయకులు తలాటం సత్య , రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంచార్జి అనుశ్రీ సత్యనారాయణ మరియు జనసేన పార్టీ నాయకులు ఎండోమెంట్ చైర్మన్లు డైరెక్టర్లు వీర మహిళలు , అభిమానులు పాల్గొన్నారు.

రాజమండ్రి మందు గల జనసేన ఉభయగోదావరి జిల్లాల పార్టీ కార్యాలయంలో ఘనంగా విజయదశమి సంబరాలు ఘనంగా జరిగాయి.
కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ , కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ , డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు , మినీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చైర్మన్ వేగుల లీలా కృష్ణ , రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ ప్రియా సౌజన్య , రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి పూల అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిగించారు. అనంతరం జాతిపిత గాంధీ మహాత్మా ఫోటోకు పూదండలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమాల తాలూకా విజయాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల హృదయాలలో ప్రత్యేక చోటును సంతరించుకున్నాయన్నారు. విశిష్ట అతిథి తంగెళ్ల ఉదయ్ మాట్లాడుతూ ఇటీవల విశాఖలో జరిగిన సమావేశం ప్రకారం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని, ఇప్పటినుండి పార్టీ ముఖ్య నాయకులుగా నెలలో రెండు, మూడు సార్లు వచ్చి వెళ్తూ ఉంటామని, ప్రజలను, కార్యకర్తలను కలిసి లోటుపాట్లు తెలుసుకుని పార్టీకి చదివేస్తామన్నారు.
ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ జనసైనికులకు, నాయకులకు, వీర మహిళలకు దశమి శుభాకాంక్షలు తెలిపుతు గత ప్రభుత్వ అరాచకాలు నుండి ప్రజలను కాపాడి మేలు చేస్తున్న కూటమీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని, నూతన ఉత్సాహంతో సాగుతున్న జనసేన నేత మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి నేను రుణపడి ఉంటామన్నారు. ప్రపంచ రాజకీయాల్లో మోడీ తర్వాత ఎక్కువ ప్రజాతరణ పొందిన వ్యక్తి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేనని, అలాంటి వ్యక్తి స్థాపించిన జనసేన పార్టీలో మేము కూడా భాగస్వామ్యం కావడం అందరికీ ఆనందదాయకనన్నారు. పత్తిపాడు జనసేన నాయకులు కత్తిపూడి బాబీ , జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి , కాకినాడ జనసేన నాయకులు తలాటం సత్య , రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంచార్జి అనుశ్రీ సత్యనారాయణ మరియు జనసేన పార్టీ నాయకులు ఎండోమెంట్ చైర్మన్లు డైరెక్టర్లు వీర మహిళలు , అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.