వార్త ముఖ్యాంశాలు
- అమడగూరు: విజయదశమి శరన్నవరాత్రుల పర్వదినాలలో భాగంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు బుధవారం శ్రీ మహాచండి దేవి అలంకరణలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.అమ్మవారికి భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు.అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త…
అమడగూరు: విజయదశమి శరన్నవరాత్రుల పర్వదినాలలో భాగంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు బుధవారం శ్రీ మహాచండి దేవి అలంకరణలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.అమ్మవారికి భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు.అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.