గన్నవరం, సెప్టెంబర్ 30 ( పున్నమి ప్రతినిధి సురేష్ )
కృష్ణాజిల్లా, గన్నవరం పట్టణంలో జాతీయ ప్రధాన రహదారి పక్కన నివాసం ఉంటున్న పైడి పవన్ బాబు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం భవానీ దీక్షాపరులకు, భక్తులకు పులిహోర, మజ్జిగ ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గన్నవరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు దండమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ., రాష్ట్రంలోని నలుమూలల, ఎక్కడెక్కడ నుంచో ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి దీక్ష పూనుకొని,కాలినడకన ప్రయాణించి అమ్మవారి మొక్కులు చెల్లించే భక్తులకు దాహార్తిని తీర్చడం చాలా తృప్తిగా ఉందని, రానున్న రోజుల్లో అమ్మవారి దయ ఉంటే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఘనంగా,భక్తితో నెరవేరుస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఎలక్ట్రీషియన్ తిరుక్కవళ్ళూర్ హరికృష్ణ, భవానీ దీక్షాపరులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


