రైల్వే కోడూరు, సెప్టెంబర్: (పున్నమి ప్రతినిధి)
రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ కమీషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు 10వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించారు.ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆయుర్వేదం ప్రాచీన వైద్య పద్ధతి అని, ఇది మానవ ఆరోగ్యానికి అపారమైన మేలుచేస్తుందని పేర్కొన్నారు. వృక్షశాస్త్ర ఉపన్యాసకుడు డాక్టర్ కె. రమేష్ ఆయుర్వేద అవసరం మరియు రోగ నిరోధక శక్తిపై ఉపన్యాసం ఇచ్చారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్ మన పూర్వీకులు ఆయుర్వేదం ద్వారా ఆయుష్షు పెంచుకున్నారని వివరించారు. రసాయనశాస్త్ర ఉపన్యాసకుడు శ్రీ కె.పి. కృష్ణమూర్తి వన మూలికల వైద్య ప్రయోజనాలను వివరించారు.
ఈ సందర్భంగా కళాశాల యన్.యస్.యస్. కోఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


