నరసన్నపేట, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి)
నరసన్నపేట మండలం యారబాడు గ్రామంలోని నీలమ్మ తల్లి గుడి ఆవరణలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యుల ఆధ్వర్యంలో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ ఘనంగా ముగిసింది. డాక్టర్ అమ్మానాయుడు, ఎంపీటీసీ కింజరాపు సూర్యనారాయణ, మాజీ ఎంపీటీసీ సింహాచలం, టీచర్స్ సురేంద్ర, డిల్లేశ్వరరావు పాల్గొన్నారు. డాక్టర్ అమ్మానాయుడు, హ్యాపీనెస్ ప్రోగ్రామ్ మహిళలకు కూడా ముఖ్యమని, యోగా శరీరం, మనసు, బుద్ధి, ఆత్మకు ఉపయోగకరమని అన్నారు. శ్రీ శ్రీ రవిశంకర్ సేవా కార్యక్రమాలను గుర్తుచేశారు. యారబాడు గ్రామ ప్రజలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు, వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్టేట్ లెవల్ యోగా గోల్డ్ మెడల్ సాధించిన సుప్రజకు ఘన సన్మానం నిర్వహించారు.


