Tuesday, 31 March 2026
  • Home  
  • స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలు, నోట్‌బుక్స్ పంపిణీ – విద్యార్థులకు స్ఫూర్తి
- నాగర్‌కర్నూల్

స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలు, నోట్‌బుక్స్ పంపిణీ – విద్యార్థులకు స్ఫూర్తి

వంగూర్, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడి పాఠశాలలో శనివారం కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకులు, శాస్త్రవేత్తలు, రచయితల చిత్రపటాలు మరియు విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యుడు, మాజీ ఎంపీటీసీ సుగుణమ్మ తనయుడు కంకణాల నర్సిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు రేపటి పౌరులని, వారికి స్ఫూర్తినిచ్చేందుకు జాతీయ నాయకుల చిత్రపటాలను అందించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు భవిష్యత్తులో కూడా చేయూత అందిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఉపాధ్యాయులు జాతీయ నాయకుల జీవితాలు విద్యార్థులకు బోధించాలని సూచించారు. హెచ్ఎం బాబురావు, ఉపాధ్యాయులు శ్రీను నాయక్, సునీత, లక్ష్మీదేవి, అంగన్వాడి టీచర్ కోట్ల లలితమ్మ, కోట్ల తనియా, జర్నలిస్టు-కవి కోట్ల గౌతమ్, గోకమోళ్ల శివశంకర్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

వంగూర్, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడి పాఠశాలలో శనివారం కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకులు, శాస్త్రవేత్తలు, రచయితల చిత్రపటాలు మరియు విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యుడు, మాజీ ఎంపీటీసీ సుగుణమ్మ తనయుడు కంకణాల నర్సిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు రేపటి పౌరులని, వారికి స్ఫూర్తినిచ్చేందుకు జాతీయ నాయకుల చిత్రపటాలను అందించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు భవిష్యత్తులో కూడా చేయూత అందిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఉపాధ్యాయులు జాతీయ నాయకుల జీవితాలు విద్యార్థులకు బోధించాలని సూచించారు. హెచ్ఎం బాబురావు, ఉపాధ్యాయులు శ్రీను నాయక్, సునీత, లక్ష్మీదేవి, అంగన్వాడి టీచర్ కోట్ల లలితమ్మ, కోట్ల తనియా, జర్నలిస్టు-కవి కోట్ల గౌతమ్, గోకమోళ్ల శివశంకర్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.