కామారెడ్డి ప్రతినిధి, 19 సెప్టెంబర్, పున్నమి న్యూస్.
కామారెడ్డి జిల్లా – రామారెడ్డి పోలీస్ స్టేషన్
ఈ రోజు 19.09.2025 ఉదయం 12:30 గంటల సమయంలో, రామారెడ్డి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్. లావణ్య ఆధ్వర్యంలో సిబ్బంది, పంచులు, వ్యవసాయ అధికారులు, వీడియోగ్రాఫర్‌తో కలసి స్కూల్ తండా గ్రామంలో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించగా, స్థానిక వ్యక్తి గంగవత్ రాజేందర్ తండ శంకర్, వయస్సు 44 సంవత్సరాలు, వృత్తి: వ్యవసాయం, కులం: లంబాడా, గ్రామం స్కూల్ తండా తన ఇంటి పెరట్లో అక్రమంగా 25 గంజాయి మొక్కలు (ఎత్తు 3–6 అడుగులు) సాగు చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు పంచుల సమక్షంలో ఆ మొక్కలను పీకివేసి, ఒక గోనె సంచిలో ప్యాక్ చేసి, సీల్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేయబడింది. వ్యవసాయ అధికారి జి. శ్రీనివాస్ పరిశీలనలో మొక్కలు నిజంగా గంజాయి మొక్కలేనని నిర్ధారించారు. నిందితుడు విచారణలో తాను వ్యక్తిగత వినియోగం మరియు అమ్మకాల కోసం గంజాయి సాగు చేస్తున్నట్లు అంగీకరించాడు.


