సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావలసిన పాత బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. ముఖ్యంగా CPS ఉద్యోగులకు రావలసిన బకాయిలు PRC ,DA ఏరియర్స్ మరియు EL Encashment (ELs) ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం దసరాకు పండుగకు రెండు డి.ఏ లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు ఎన్ క్యాష్మెంట్ కి అప్లై చేసుకొనిదాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది.
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే “మెరుగైన PRC తో పాటు పాత బకాయిలు కూడా చెల్లిస్తాం” అని హామీ ఇచ్చినా, ఇప్పటి వరకు ఈ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరాశ కలిగించింది.
ఉద్యోగుల న్యాయబద్ధమైన హక్కులను వాయిదా వేయడం తగదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని అన్ని బకాయిలను విడుదల చేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జిల్లా పక్షాన ఏపీ ప్రైమరీ టీచర్ అసోసియేషన్ (ఆప్టా) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షబ్బీర్ హుస్సేన్, షానవాజ్ హుస్సేన్ మాజీంద్రని డిమాండ్ చేస్తున్నారు.


