పున్నమి న్యూస్, సీనియర్ జర్నలిస్ట్ రమణ: అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరం ఎమ్మెల్యే ఆనందరావు ప్రారంభించారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎంపీ హరీష్ మాధుర్ ప్రారంభించారు, ఈసీజీ విభాగాన్ని అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మెట్ల రమణబాబు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ ప్రారంభించారు. అనంతరం వారు కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జీఎస్టీ తగ్గించినందుకు నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ హరీశ్ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలు గా ఎదిగి తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారన్నారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేసే ప్రధాని దేశానికి దొరకడం అదృష్టం అన్నారు. ఆయన నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం తో ఉండాలన్నారు. నల్లా పవన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తన దార్శనిక నాయకత్వం, అవిశ్రాంత కృషితో భారతదేశానికి కొత్త దిశా నిర్దేశం చేశారన్నారు. ఆయన జీవితం పూర్తిగా మచ్చలేనిదన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ తో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. పలు దేశాల ప్రజలు మోడీ లాంటి ప్రధాని కావాలని కోరుకుంటున్నారన్నారు. నరేంద్ర మోడీ ప్రపంచ నాయకుడన్నారు. స్వావలంబన మరియు అభివృద్ధిపై దృష్టి సాధించి భారత దేశాన్ని బలోపేతం చేస్తున్నారన్నారు. నేటి నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కంటి వైద్య శిబిరంలో కళ్లజోళ్లు అవసరం అయిన వాళ్లకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయలక్ష్మి, అమలాపురం పట్టణ బీజేపీ అధ్యక్షులు అయ్యల భాషా, యాళ్ల దొరబాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్తిబాబు, చిరంజీవి ప్యాన్స్ అధ్యక్షులు నల్లా చిట్టిబాబు, టీడీపీ మహిళా సీనియర్ నాయకులు పెచ్చెట్టి విజయలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు కల్వకొలను తాతాజీ, ఏడిద శ్రీను, నల్లా అజయ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


