Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • మంగళవారం జిల్లా కలెక్టర్ గాంధారి మండలంలోని గర్గుల్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి వంటగదిలో మధ్యాహ్నం భోజనం కోసం వండుతున్న ఆహారాన్ని పరిశీలించారు.అనంతరం ఐదో తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యా నైపుణ్యాలను పరిశీలించి నోట్ బుక్స్ ను అందజేశారు.
  • ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు ఇంకా కురుస్తున్నందున పాఠశాల పరిసరాలు మరియు వంటగదిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ మెనూ ప్రకారం వండి వేడివేడి ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు.
  • అదేవిధంగా విద్యార్థులకు జీవితంలో ఉపయోగపడేలా ఇప్పటి నుండే విద్య నైపుణ్యాలు పెంపొందించాలని సూచించారు.

               మెనూ ప్రకారం  ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ గాంధారి మండలంలోని గర్గుల్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి వంటగదిలో మధ్యాహ్నం భోజనం కోసం వండుతున్న ఆహారాన్ని పరిశీలించారు.
అనంతరం ఐదో తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యా నైపుణ్యాలను పరిశీలించి నోట్ బుక్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు ఇంకా కురుస్తున్నందున పాఠశాల పరిసరాలు మరియు వంటగదిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ మెనూ ప్రకారం వండి వేడివేడి ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులకు జీవితంలో ఉపయోగపడేలా ఇప్పటి నుండే విద్య నైపుణ్యాలు పెంపొందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, డీఈవో రాజు, స్థానిక ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *