విశాఖపట్నం వన్‌టౌన్ ప్రాంతంలో అక్రమంగా దివాళీ పటాకులు అమ్ముతున్నారని సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు లక్ష రూపాయల విలువైన మందుగుండు సామగ్రి (పటాకులు)ను స్వాధీనం చేసుకున్నారు.
దాడిలో పట్టుబడిన షాపు యాజమాని పాలూరి ప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ, అనుమతి లేకుండా ప్రమాదకరమైన పటాకులు అమ్మకాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


