Tuesday, 31 March 2026
  • Home  
  • ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా
- హైదరాబాద్

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈ ఉదయం ప్రారంభమైన శోభాయాత్రలో భక్తుల సందడి వెల్లివిరిసింది. భారీ బందోబస్తు నడుమ గణనాథుడి మహా విగ్రహం భక్తుల హర్షధ్వానాల మధ్య ప్రస్థానం కొనసాగిస్తోంది. ప్రస్తుతం విగ్రహం టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకుంది. అక్కడ గణపయ్యకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, మంత్రోచ్ఛరణలతో ఆరాధన చేశారు. కాసేపట్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకోనుంది. ఈ మార్గంలో భక్తులు పెద్ద సంఖ్యలో గణనాథుడిని దర్శించేందుకు తరలివస్తున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు శోభాయాత్రను విజయవంతం చేయడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో హుస్సేన్ సాగర్లో క్రేన్ నం.4 వద్ద మహాగణపతిని గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేయనున్నారు. “గణపతి బప్పా మోరియా” నినాదాలతో ఉత్సాహభరితంగా పాల్గొంటున్న భక్తులు ఈ మహోత్సవాన్ని మరింత వైభవోపేతంగా మలుస్తున్నారు.

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా
హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈ ఉదయం ప్రారంభమైన శోభాయాత్రలో భక్తుల సందడి వెల్లివిరిసింది. భారీ బందోబస్తు నడుమ గణనాథుడి మహా విగ్రహం భక్తుల హర్షధ్వానాల మధ్య ప్రస్థానం కొనసాగిస్తోంది.
ప్రస్తుతం విగ్రహం టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకుంది. అక్కడ గణపయ్యకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, మంత్రోచ్ఛరణలతో ఆరాధన చేశారు. కాసేపట్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకోనుంది. ఈ మార్గంలో భక్తులు పెద్ద సంఖ్యలో గణనాథుడిని దర్శించేందుకు తరలివస్తున్నారు.
పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు శోభాయాత్రను విజయవంతం చేయడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో హుస్సేన్ సాగర్లో క్రేన్ నం.4 వద్ద మహాగణపతిని గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేయనున్నారు.
“గణపతి బప్పా మోరియా” నినాదాలతో ఉత్సాహభరితంగా పాల్గొంటున్న భక్తులు ఈ మహోత్సవాన్ని మరింత వైభవోపేతంగా మలుస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.