చిట్వేలి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
చిట్వేలి మండలం నగిరిపాడు పంచాయతీ పరిధిలోని కుమ్మరపల్లి గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమం శనివారం ఉత్సాహంగా జరిగింది. కట్టా శివ తండ్రి కిట్టయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.నిమజ్జన వేడుకలో భాగంగా అన్నదానం నిర్వహించగా, గ్రామ పెద్దలు, యువత, పిల్లలు అందరూ సత్కార్యాల్లో భాగమయ్యారు. ఉట్టి కొట్టడం, లడ్డు వేలం పాట వంటి సంప్రదాయ కార్యక్రమాలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా లడ్డు వేలం పాటలో గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని హరివిల్లు వాతావరణాన్ని సృష్టించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ వినాయక నవరాత్రి వేడుకలు సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.


