అన్నమయ్య జిల్లా ఆగస్టు పున్నమి ప్రతినిధి
అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి మహోత్సవాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ యం. వెంకటాద్రి ప్రత్యేక పూజల్లో పాల్గొని, వినాయకుడు సమాజం నుంచి విఘ్నాలు తొలగించి సుఖశాంతులు కలిగించాలని ప్రార్థించారు.పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి గీతాలు పాడి, హారతులు ఇచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. సమిష్టిగా జరుపుకున్న ఈ వేడుక పోలీసు కుటుంబంలో అనుబంధాన్ని బలపరిచింది.


