పుల్లంపేట మండలం రెడ్డిపల్లి గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
గ్రామస్తులతో కలిసి గంగమ్మ తల్లికి మంగళహారతులు అందజేసిన అనంతరం, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ –
గ్రామాల్లో సాంప్రదాయ విలువలు, ఆచారాలు కొనసాగాలని,
యువతలో భక్తి భావం పెంపొందాలని ఆకాంక్షించారు.
అలాగే ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు.


