Tuesday, 24 March 2026
  • Home  
  • డ్రోను రెక్కలు తగిలి ఇద్దరికీ గాయాలు.. 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలింపు.
- జోగులాంబ గద్వాల

డ్రోను రెక్కలు తగిలి ఇద్దరికీ గాయాలు.. 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలింపు.

అలంపూర్ : ఆగస్టు 13 ( పున్నమి ప్రతినిధి )జోగులాంబ గద్వాల జిల్లా, మానవపాడు మండలం, పొలంలో పురుగుల మందు కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు డ్రోన్ రెక్కలు తగిలి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని స్థానికులు తెలిపారు. మానవపాడు మండల పరిధిలోని చంద్రశేఖర్ నగర్ గ్రామంలో ఓరైతుకు చెందిన మొక్కజొన్న పంటకు ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన అలీ బాబు ( డ్రోన్ యజమాని ) డ్రోన్ సహాయంతో మందులు పిచికారి చేశాడు, ఆయనతోపాటు బొంకూరు గ్రామానికి చెందిన నాగన్న ను, ఆలీ బాబు కూలి కోసం వెంట తెచ్చుకున్నాడు. అయితే డ్రోను ను కిందకు దించే సమయంలో ప్రమాదవశత్తు నాగన్న కుడి చేతికి రెండు వేళ్ళు తెగడంతో పాటు తలకు గాయాలయ్యాయి. డ్రోన్ యజమాని అలీ బాబుకు స్వల్ప గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అలంపూర్ : ఆగస్టు 13 ( పున్నమి ప్రతినిధి )జోగులాంబ గద్వాల జిల్లా, మానవపాడు మండలం, పొలంలో పురుగుల మందు కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు డ్రోన్ రెక్కలు తగిలి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని స్థానికులు తెలిపారు. మానవపాడు మండల పరిధిలోని చంద్రశేఖర్ నగర్ గ్రామంలో ఓరైతుకు చెందిన మొక్కజొన్న పంటకు ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన అలీ బాబు
( డ్రోన్ యజమాని ) డ్రోన్ సహాయంతో మందులు పిచికారి చేశాడు, ఆయనతోపాటు బొంకూరు గ్రామానికి చెందిన నాగన్న ను, ఆలీ బాబు కూలి కోసం వెంట తెచ్చుకున్నాడు. అయితే డ్రోను ను కిందకు దించే సమయంలో ప్రమాదవశత్తు నాగన్న కుడి చేతికి రెండు వేళ్ళు తెగడంతో పాటు తలకు గాయాలయ్యాయి. డ్రోన్ యజమాని అలీ బాబుకు స్వల్ప గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.