ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ నూతనంగా రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం పాణ్యం మండలంలో నీటి పారుదల శాఖ కార్యాలయంలో రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గత పాలకులు ఉద్యోగుల బకాయిలు పరిష్కరించాలని సమస్యల తోరణం తో ధర్నాలకు వెళితే ఉద్యోగులను దేశద్రోహులుగా భావించి మన రాష్ట్ర అధ్యక్షులు కె ఆర్ సూర్యనారాయణని అరెస్టు చేసే ప్రయత్నం చేశారన్నారు. అయితే ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయని ప్రభుత్వాలు మనకెందుకని మనం నూతనంగా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైబడిన ఇంకా ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోవడం ఆవేదన కలిగిస్తున్నది అన్నారు. ఇప్పటికే ఉద్యోగులకు సుమారు 35 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉందని ఈ మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో అర్థం కావడం లేదన్నారు. అందుకని జిల్లా కేంద్రాలు, పరిసర మండలాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఇళ్ల స్థలాల రూపంలో ఉద్యోగులకు ఇచ్చి వారికి ఇవ్వాల్సిన బకాయిలను జమ చేసుకోవడం వలన ఇటు ఇల్లు నిర్మించుకోవాలన్న ఉద్యోగుల కల అటు ప్రభుత్వ బకాయిలు రెండు నెరవేరుతుందని రాష్ట్ర అధ్యక్షులు అభిప్రాయమని నాగేంద్రప్ప పేర్కొన్నారు. దీంతోపాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక సంఘం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘమే అన్నారు. రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమంలో కూడా ఏదైనా ఉద్యోగ సమస్యలు ఉంటే తమ సంఘం దృష్టికి తీసుకువస్తే సత్వరం జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కారం కి కృషి చేస్తానని జిల్లా అధ్యక్షులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉద్యోగులు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే టీ తాగుతూ చర్చించుకుందాం- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రప్ప