సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి ఆర్థిక సహాయం
నరసన్నపేట మండలం, ఈతపేట దగ్గర వున్న అమరావతి కోచింగ్ సెంటర్ లో B. కాగేశ్వరరావు గారు (రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి), నిరుపేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉచితంగా ఫిట్నెస్ కి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తున్నారు, త్వరలోనే అగ్ని వీర్, అగ్నిపత్ ప్రారంభమవుతాయి కనుక, నిరుపేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సమయంలో ఫిట్నెస్ కోసం కొంత ఆహారం అవసరం అవుతుందని, సహాయం చేయమని, సంస్థలకు మరియు దాతలకు కోరడం జరిగింది,ఈ విషయం తెలుసుకున్న వెంటనే మన సిక్కోలు స్వచ్చంధ సేవా సమితి సంస్థ తరఫున నిరుపేద విద్యార్థులు ఫిట్నెస్ కోసం 8000 రూపాయిలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో మన సంస్థ సభ్యులు రేవాడ త్రినాధ రావు మాస్టర్, సురపతి లక్ష్మణరావు మరియు వరప్రసాద్ పాల్గొన్నారు

