రైల్వేకోడూరు జూలై 21 పున్నమి ప్రతినిధి
అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లి మండలం, రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద గత ఆదివారం 13వ తేదీ మామిడికాయ లారీ, ప్రమాదంలో మృతి చెందిన తొమ్మిది మంది వ్యవసాయ కూలీలకు, ప్రభుత్వం కుటుంబానికి 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి, 10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం తాసిల్దార్ కార్యాలయం వద్ద, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతి పత్రం, ఎమ్మార్వో అమర్నాథ్ గారికి , సమర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, పి శ్రీనివాసులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ. ప్రమోదం జరిగి, వారం రోజులు దాటిన, సెట్టిగుంట వ్యవసాయ కూలీలు , వారి బంధువులు, కాళహస్తి ,వెంకటగిరి 9 మంది అక్కడికక్కడే మృతి చెందడం, మరో పదిమంది, తీవ్రంగా గాయపడటం జరిగిందన్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించకుండా, గిరిజనులు యానాదులు, పట్ల వివక్షత చూపుతోందని ఆరోపించారు. సెట్టిగుంటలో రెండు కుటుంబాలు తల్లిదండ్రులు, కోల్పోయిన పిల్లలు నలుగురు, మైనర్ పిల్లలు అనాధలుగా మిగిలారన్నారు, ఇప్పటివరకు, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం గానీ,దాతలు గాని, ఒక్క రూపాయి కూడా సహాయం అందలేదన్నారు. ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాజంపేట హాస్పిటల్ లో, క్షతగాత్రులను, పరామర్శించినప్పుడు, సిఐటియు నాయకులు వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేయగా, ముఖ్యమంత్రి చంద్రబాబు తో మాట్లాడి, సహాయం ప్రకటిస్తామని, చెప్పి వారం అయినా, ఒక్క రూపాయి ప్రకటించలేదన్నారు. దీన్నిబట్టి కూటమి ప్రభుత్వం, గిరిజనుల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది అన్నారు. ఈ ఘటనకు ప్రధానంగా, నేషనల్ హైవే రోడ్, చెరువు కట్ట పైన, రక్షణ గోడ లేకపోవడమే, ప్రమాదానికి ప్రధాన, కారణమన్నారు. దీనికి, రోడ్లు భవనాల శాఖ మంత్రి, బాధ్యత వహించాలన్నారు. ఆ గిరిజనులకు ఇంటినిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు.ఇంటికి తలుపు కూడా లేని దౌర్భాగ్య పరిస్థితిలో జీవిస్తున్నారన్నారు. మూడు ఎకరాలు, ప్రభుత్వం భూమి ఇచ్చిఆదుకోవాలన్నారు. తిరుపతి రొయ్య హాస్పిటల్ లో, బాధితులని ప్రవేట్ హాస్పిటల్కు పొమ్మని ఒత్తిడి తెస్తున్నారన్నారు. బాధితులు వాపోయారన్నారు. ఒక గిరిజనుడు పుత్తూరు నాటువైద్యం చేయించుకున్నారు మెరుగైన వైద్యం అందడం లేదన్నారు. ప్రభుత్వం, మృతుల పట్ల, ముసలి కన్నీరు కార్చందని,ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి, ఇన్చార్జి మంత్రి మాట నిలబెట్టుకొని, వారి కుటుంబాలను ఆదుకొని, న్యాయం చేయాలని, లేకుంటే, బాధితులతో కలిసి కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో, సిఐటియు, మండల కార్యదర్శి, పి జాన్ ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం, మండల కన్వీనర్, బొజ్జ శివయ్య, గిరిజన సంఘం, నాయకులు వెంకటరమణ, వ్యవసాయ కౌలుదారు సంఘం జిల్లా నాయకులు, రమేష్ బాబు, జిల్లా నాయకులు, వెంకటాద్రి,సిఐటియు, ఉపాధ్యక్షులు, లింగాల.యానాదయ్య, సహాయ కార్యదర్శి, నగిరిపాటి ఆనంద్, ముత్యాల శ్రీనివాసులు, బండారు రాజశేఖర్,శివ, రసూల్, హరి నారాయణ, సిఐటియు, ఓబులవారిపల్లె, మండల కార్యదర్శి, నాగి పోగు పెంచలయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు, లతీఫ్, మండల నాయకులు, విష్ణు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.


