Thursday, 26 March 2026
  • Home  
  • “స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమం నిర్వహించిన జిల్లా పోలీసులు..
- అన్నమయ్య

“స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమం నిర్వహించిన జిల్లా పోలీసులు..

రాయచోటి జులై 19: (పున్నమి ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ. నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రతి మూడవ శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించబడుతున్న “స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు జిల్లా వ్యాప్తంగా.. పోలీసు అధికారులు సిబ్బంది కలిసి.. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, సబ్ డివిజన్ అధికారుల కార్యాలయాలు, సర్కిల్ ఇన్స్పెక్టర్ల కార్యాలయాలు, అన్ని పోలీస్ స్టేషన్లలో శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు.జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, జిల్లాలోని పోలీసు అధికారుల కార్యాలయాలు, పోలీసు స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్త, వ్యర్థాలను తొలగించి పరిసరాలు పరిశుభ్రం చేశారు. గుణపం, పారలు చేతబట్టి పిచ్చి మొక్కలు తొలగించారు. చెట్లకు పాదులు తీసి నీరు పోశారు.”స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం ప్రతి నెలా మూడో శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడుతుంది. పరిసరాల పరిశుభ్రత గురించి, ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు. ముఖ్య కూడళ్లలో మానవహారంగా ఏర్పడి స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రతిజ్ఞ చేపించారు. అన్నమయ్య జిల్లా పోలీసులు “స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరగడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

రాయచోటి జులై 19: (పున్నమి ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ. నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రతి మూడవ శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించబడుతున్న “స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు జిల్లా వ్యాప్తంగా.. పోలీసు అధికారులు సిబ్బంది కలిసి.. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, సబ్ డివిజన్ అధికారుల కార్యాలయాలు, సర్కిల్ ఇన్స్పెక్టర్ల కార్యాలయాలు, అన్ని పోలీస్ స్టేషన్లలో శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు.జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, జిల్లాలోని పోలీసు అధికారుల కార్యాలయాలు, పోలీసు స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్త, వ్యర్థాలను తొలగించి పరిసరాలు పరిశుభ్రం చేశారు. గుణపం, పారలు చేతబట్టి పిచ్చి మొక్కలు తొలగించారు. చెట్లకు పాదులు తీసి నీరు పోశారు.”స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం ప్రతి నెలా మూడో శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడుతుంది. పరిసరాల పరిశుభ్రత గురించి, ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు. ముఖ్య కూడళ్లలో మానవహారంగా ఏర్పడి స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రతిజ్ఞ చేపించారు. అన్నమయ్య జిల్లా పోలీసులు “స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరగడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.