Tuesday, 24 March 2026
  • Home  
  • ఖమ్మం సాయి బాబా దేవస్థానం వార్షికోత్సవ వేడుకలు – భక్తుల ఆహ్వానం
- Featured - తెలంగాణ

ఖమ్మం సాయి బాబా దేవస్థానం వార్షికోత్సవ వేడుకలు – భక్తుల ఆహ్వానం

ఖమ్మం సాయి బాబా దేవస్థానం వార్షికోత్సవ వేడుకలు – భక్తుల ఆహ్వానం పున్నమి న్యూస్ – ఖమ్మం ప్రతినిధి నాగేంద్ర కుమార్ పువ్వాడ ఖమ్మం నగరంలోని VDOS కాలనీలో ఉన్న సాయిబాబా ఆలయం 12వ వార్షికోత్సవ వేడుకలను జూన్ 2వ తేదీన (సోమవారం) ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సన్నాహాలు పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ బాధ్యులు శ్రీమతి మిక్కిలినేని మంజుల నరేంద్ర గారు భక్తులందరినీ ఈ పవిత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజున వేకువజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించబడనున్నాయి. మధ్యాహ్న సమయంలో భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయి బాబా భక్తులు అధిక సంఖ్యలో హాజరై దివ్య దర్శనం పొందాలని, ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షిస్తున్నారు.

ఖమ్మం సాయి బాబా దేవస్థానం వార్షికోత్సవ వేడుకలు – భక్తుల ఆహ్వానం

పున్నమి న్యూస్ – ఖమ్మం ప్రతినిధి నాగేంద్ర కుమార్ పువ్వాడ

ఖమ్మం నగరంలోని VDOS కాలనీలో ఉన్న సాయిబాబా ఆలయం 12వ వార్షికోత్సవ వేడుకలను జూన్ 2వ తేదీన (సోమవారం) ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సన్నాహాలు పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ బాధ్యులు శ్రీమతి మిక్కిలినేని మంజుల నరేంద్ర గారు భక్తులందరినీ ఈ పవిత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ రోజున వేకువజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించబడనున్నాయి. మధ్యాహ్న సమయంలో భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

సాయి బాబా భక్తులు అధిక సంఖ్యలో హాజరై దివ్య దర్శనం పొందాలని, ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.