Thursday, 12 February 2026
  • Home  
  • షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతి రోజూ ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి????? డాక్టర్ MVR________
- Featured - హెల్త్ టిప్స్

షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతి రోజూ ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి????? డాక్టర్ MVR________

*షుగర్ వ్యాధిగ్రస్తులు రోజువారి తీసుకోవలసిన జాగ్రత్తలు* _______________________ భారతదేశంలో మధుమేహ(డయాబెటిక్/షుగరు) రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వుంది.భారతదేశ జనాభాలో 11.4% డయాబెటిక్ రోగులు ఉంటే, డయాబెటిక్ పూర్వ దశలో అదనంగా మరో 15.3% ఉన్నారు. దీని అర్థం సుమారు 101.3 మిలియన్ల(10కోట్ల పైచిలుకు) మంది డయాబెటిస్‌తో జీవిస్తున్నారు. మరియు 136 మిలియన్ల మంది మధుమేహ ముందు దశలో ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యతో ప్రస్తుతం భారతదేశం “మధుమేహ ప్రపంచ రాజధాని” గా మారింది. ఈ గణాంకాలు మధుమేహ వ్యాది తీవ్రతను, విస్తృతిని సూచిస్తాయి. పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల కంటే ఎక్కువ సంఖ్యను చూపుతున్నాయి. షుగరు ఒకసారి వస్తే దరిదాపుగా జీవితమంతా ఉంటుంది. షుగర్ వల్ల ఇబ్బంది పడ కుండా చూసుకోవాలి. షుగర్ అన్నది కుక్కలాంటిది. దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటే బొచ్చు కుక్క. జాగ్రత్త లేకుండా పెంచుకుంటే పిచ్చికుక్క. బొచ్చు కుక్కేమో తోకాడించుకుంటూ మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది పిచ్చికుక్కమో దాని ఇష్టం వచ్చినట్టు కొరికి పారేస్తుంది. అందుకే పిచ్చి కుక్కలా కాకుండా బొచ్చు కుక్కలాగా పెంచుకోవాలి. అలా జరగాలి అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు సరైనటువంటి జీవనరళి అలవర్చుకోవాలి. చెడు అలవాట్లు లేకుండా మంచి అలవాట్లను కలిగివుండాలి.ఆ అలవాట్లు ఏమిటో కింద చూద్దాం. *వేళకు అన్నం తినాలి* ……… _____________________ వంట్లో షుగర్ ఎక్కువ ఉన్నా వెంటనే పెద్ద ప్రమాదం లేదు కానీ, షుగర్ తగ్గిపోతే గంటల్లోనే ప్రమాదం. అలా జరగకుండా ఉండాలంటే వేళకు తినాలి. ఆకలిగా ఉందని, రుచిగా ఉందని ఎక్కువ తినకూడదు. ఆకలిగా లేదని రుచిగా లేదని తక్కువ తినకూడదు. ఎక్కువ తింటే షుగర్ పెరుగుతుంది. తక్కువ తింటే షుగర్ తగ్గుతుంది.అలా జరగకుండా ఉండాలంటే సరైన సమయంలో, సరైన మోతాదులో ఆహారం తీసుకోవాలి. *ఎత్తుకుతగిన బరువు ఉండాలి ….. ..* _______________________ ఊబకాయం ఉండకూడదు. ఊబకాయం అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. ఊబకాయాన్ని ఎప్పుడూ అదుపులో పెట్టుకోవాలి. ఎత్తుని సెంటీమీటర్లలో కొలుచుకుని అందులో నుంచి 100 తీసేస్తే ఎంత వస్తుందో అన్ని కేజీలు ఉండవచ్చు. అంటే 170 సెంటీమీటర్లు ఎత్తున్నవ్యక్తి 70 కేజీలు వుండవచ్చును. *సరిపోయినంత నిద్రపోవాలి.* ……. _______________________. శరీరానికి నిద్ర చాలా ముఖ్యం. శరీరంలో జరిగినటువంటి ఇబ్బందులకు రిపేర్ జరిగేది నిద్రలోనే. పగలు,రాత్రి కలిపి రోజుకు 8 గంటలు నిద్ర కావాలి. 6 గంటల కంటే తక్కువ నిద్ర, 10 గంటల కంటే ఎక్కువ నిద్ర రెండూ ప్రమాదమే. ప్రతిరోజూ అదే వేళకి నిద్రపోవడం మంచిది. సరిపోయినంత నిద్ర లేనప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి. షుగర్, బీపీలు అదుపు తప్పుతాయి. షుగర్ వల్ల వచ్చే సమస్యలు పెరుగుతాయి. *జేబులో ఎప్పుడూ రెండు చాక్లెట్లు ఉంచుకోవాలి…….* _______________________ ఎందుకంటే ఒంట్లో షుగర్ తగ్గితే మెదడు సరిగా పనిచేయక గంటల్లో స్పృహ కోల్పోయే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిలో వెంటనే రెండు స్పూన్ల గ్లూకోస్ పౌడర్ గాని రెండు స్పూన్ల చక్కెర గాని తీసుకుంటే 15 నిమిషాల్లో స్పృహలోకి వచ్చేస్తారు. ఇంట్లో ఉంటే చక్కెర తీసుకోగలం పొలంలో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు షుగర్ తగ్గితే అప్పుడు చక్కెర దొరకదు కదా? అందుకే షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్లినా ఎప్పుడూ రెండు స్పూన్లు చక్కెర గాని, రెండు చాక్లెట్లు గాని జేబులో ఉంచుకోవాలి. చక్కెరని జోబులో ఉంచుకోవడం కష్టం కదా! అందుకే షుగర్ ఉన్నవాళ్లు ఎప్పుడూ జేబులో రెండు చాక్లెట్లను తప్పకుండా ఉంచుకోవాలి. జేబులో చాక్లెట్ ఉంచుకుంటే వచ్చే ముఖ్యమైన ఇబ్బంది చాక్లెట్ లను తినాలని అనిపించడం. తినాలనిపించినా తినకూడదు. షుగర్ తగ్గినప్పుడు జరిగే అత్యవసర వైద్యానికి అవసరమైన మాత్రగా భావించి చాక్లెట్లు తినకుండా జోబులోనే ఉంచుకోవాలి. *పడుకునేటప్పుడు పాదాలను, తొడుక్కునేటప్పుడు చెప్పులను పరీక్షించుకోవాలి. ……* _______________________ షుగర్ ఎక్కువ కాలం ఉన్నటువంటి వాళ్లకు నరాలు దెబ్బతిని కాళ్లకు స్పర్శ తగ్గిపోతుంది. కాళ్లకు చీల గచ్చుకున్నా, ముల్లు గుచ్చుకున్నా నొప్పి తెలియకుండా నడుస్తూనే వుంటారు. కాలుకు బాగా చీము పట్టినప్పుడు తేరుకొని డాక్టర్ దగ్గరికి పోతుంటారు. అలా జరగకుండా ఉండాలంటే పాదాలకి ఏమైనా గాయమైందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి రోజూ పాదాలను ఎవరికివారు పరీక్షించుకోవాలి. పెద్ద వయసులో ఎవరి పాదాలను వాళ్ళు చూసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి భార్య పాదాలను భర్త, భర్త పాదాలను భార్య పరీక్ష చేసుకోవడం మంచిది. కొన్ని సందర్భాలలో చెప్పులో చీల గాని ముళ్ళు గాని. గుచ్చుకొని ఆ చీల కాళ్లకు గుచ్చుకుంటూనే ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే పొద్దున్నే తొడుక్కు నేటప్పుడు చెప్పులను పరీక్షించుకోవాలి. చెప్పులు లేకుండా తిరగకూడదు. వీలైతే ఇంట్లో కూడా చెప్పులేసుకునే తిరగాలి. వీలైతే బాత్రూం లో కూడా వేరే చెప్పులు ఉండాలి. ఎక్కడ చెప్పులు అక్కడే. *_ధూమపానం, మద్యపానం, పొగాకు నమలడం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి…….._* ______________________ పొగ తాగితే షుగర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. షుగర్ ఉన్నటువంటి వాళ్లకి షుగర్ ద్వారా వచ్చే సమస్యలు చాలా ఎక్కువ అవుతాయి. పొగాకు సంబంధించిన పదార్థాలు వాడితే గుండెపోటు,పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాళ్ళకు రక్తం అందక కాళ్లు తీసివేయవలసిన పరిస్థితి రావచ్చు. అందుకే షుగర్ ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితులలో పాగాకు సంబంధిత పదార్థాలు వాడకూడదు. *షుగర్ ఉన్నవాళ్లు షుగర్నే కాదు ఉప్పును కూడా తగ్గించుకోవాలి. …….* ________________”__’____ ఆచరించకపోయినప్పటికీ షుగర్ ఉన్నవాళ్లు షుగర్ తినకూడదని అందరికీ తెలుసు. షుగర్ ఉన్నవాళ్లు ఉప్పును కూడా తగ్గించుకోవాలని చాలామందికి తెలియదు. షుగర్ ఉన్న వాళ్ళకి అధిక రక్తపోటు (బీపీ) వచ్చే అవకాశం ఎక్కువ. బిపి ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే షుగర్ ఉన్నవాళ్లు చక్కెరతో పాటు ఉప్పుని కూడా తగ్గించుకోవాలి. బిపి ఉన్నవాళ్లు కూడా ఉప్పుతో పాటుచక్కెరను కూడా తగ్గించుకోవాలి. షుగరు, బిపి లేని వారు కూడా ఉప్పుని, చక్కెరని రెండింటిని తగ్గించుకోవడం మరీ మంచిది. *_ప్రతిరోజు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి………._* బిబిఎన్________________’_’_’____ శారీరక వ్యాయామం చేయడం షుగరు అదుపులో ఉంచుకోవడానికి బాగా పనికొస్తుంది. షుగర్ వల్ల వచ్చే సమస్యను తగ్గించడానికి కూడా బాగా పనిచేస్తుంది. వ్యాయామం వల్ల రక్త ప్రసరణ మెరుగై గుండెపోటు, పక్షవాతం, కాళ్లు చెడిపోవడం లాంటి సమస్యల్ని బాగా తగ్గించుకోవచ్చు. శరీరంలోని జీవనక్రియలు అన్నీ మెరుగవడానికి అవకాశం ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది. రోజువారి శారీరక శ్రమ చేసే వాళ్ళకి వ్యాయామం అంత అవసరం లేదు. కానీ శారీరక శ్రమ లేని వారు మాత్రం కచ్చితంగా ప్రతిరోజు 1 గంట సమయాన్ని వ్యాయామం కోసం కేటాయించడం మంచిది. *_షుగర్ ఉందన్న విషయం తన కుటుంబ సభ్యులకు తన సహ ఉద్యోగులందరికీ తెలిసి ఉండాలి. …._* _______________________ మనకున్న జబ్బును పదిమందికి తెలియజేయడానికి భయపడతాం, గోప్యంగా ఉంచుతాం . షుగర్ ఉన్న వాళ్ళకి ఈ గోప్యత ఉండకూడదు. తనకు షుగర్ ఉందన్న విషయం తన సహ ఉద్యోగులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులందరికీ తెలిసి ఉండాలి. ఎందుకంటే షుగర్ ఉండి ఏదో సందర్భంలో షుగర్ తగ్గిపోయి, స్పృహ లేకుండా పోయినప్పుడు వెంటనే ప్రాథమిక వైద్యం చేయడానికి వీరందరూ పనికొస్తారు. ఎప్పుడైనా చమట పట్టి, స్పృహలో తేడా ఉందనిపిస్తే షుగర్ తగ్గిందని భావించి వెంటనే చక్కెర నోట్లో వేయవలెనని మిత్రులకు, సహ ఉద్యోగులకు, కుటుంబ సభ్యులందరికీ చెప్పుకొని ఉండాలి. వీరందరికి చెప్పుకొని ఉండడం ద్వారా షుగర్ తగ్గిన అత్యవసర పరిస్థితిలో ప్రాథమిక వైద్యం చేయడానికి, మిగిలిన వైద్యాన్ని అందించడం కోసం వైద్యుని దగ్గరికి ఆలస్యం లేకుండా తీసికెళ్ళడానికి ఉపయోగపడతారు. అందుకే మీకు షుగర్ ఉన్న విషయం మీ బంధుమిత్రులందరికి తెలియజెప్పి ఉండాలి. *_స్థానాల గదిలో పాదాలకు రెండు నిమిషాలు కేటాయించాలి……..*_ ______________________ షుగర్ వ్యాధిగ్రస్తులు పాదాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్ళను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. స్నానం చేసేటప్పుడు ఒళ్లంతా శుభ్రం చేసుకుంటాం కానీ పాదాలను మాత్రం పట్టించుకోం. స్నానం పూర్తయిన తర్వాత పాదాలను శుభ్రం చేసుకోవడానికి రెండు నిమిషాలు కేటాయించగలిగితే కాళ్లు బాగా శుభ్రపడతాయి. కాళ్లకు వచ్చేటటువంటి సమస్యల్ని చాలా వరకు తగ్గించుకోగలం. కాళ్ళని ఊరకనే రుద్దడం కాకుండా కాళ్ళ కోసం ఓ ప్రత్యేకమైన రాయి అందుబాటులో ఉంది. దానిని ప్యూమిక్ స్టోన్ అంటారు. ఆ రాళ్లతో పాదం మొత్తాన్ని రుద్దుకోగలిగితే పాదాలకున్న గట్టిదనం పోయి కాలు మృదువుగా, ఆరోగ్యకరంగా ఉంటుంది .అందుకే స్నానాల గదిలో కనీసం రెండు నిమిషాలు పాదాలకు కేటాయించడం మంచిది.‌ *_ఎప్పుడూ చెప్పులు వేసుకునే ఉండాలి._ ……*_ _____________________ ఎక్కువ కాలం షుగర్ ఉండే వాళ్ళకి స్పర్శ తగ్గిపోతున్న కారణంగా చిన్న గాయాలు కూడా సరిగా తెలియకుండా ఉంటాయి. కాబట్టి చెప్పులు లేకుండా నడవకూడదు. ఇంట్లో కూడా చెప్పులేసుకోవడం మంచిది. బాత్రూంలో కూడా చెప్పులేసుకుంటే ఇంకా మంచిది. ఇంట్లో చెప్పులు ఇంట్లో, బయట చెప్పులు బయట ఉండేటట్టుగా రెండు జతలు వాడుకోవడం మంచిది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే షుగర్ అన్నది జీవిత కాలం పాటు ఉన్నా దానివల్ల వచ్చే సమస్యలన్నిటిని దరిదాపుగా అదుపులో పెట్టగలిగిన పరిస్థితి ఉంటుంది. చివరిగా ఒక్క మాట “నోరు అదుపులో ఉంటే షుగర్ అదుపులో ఉంటుంది”. డాక్టర్ ఎం.వి. రమణయ్య ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు

*షుగర్ వ్యాధిగ్రస్తులు రోజువారి తీసుకోవలసిన జాగ్రత్తలు*


_______________________

భారతదేశంలో మధుమేహ(డయాబెటిక్/షుగరు) రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వుంది.భారతదేశ జనాభాలో 11.4% డయాబెటిక్ రోగులు ఉంటే, డయాబెటిక్ పూర్వ దశలో అదనంగా మరో 15.3% ఉన్నారు. దీని అర్థం సుమారు 101.3 మిలియన్ల(10కోట్ల పైచిలుకు) మంది డయాబెటిస్‌తో జీవిస్తున్నారు. మరియు 136 మిలియన్ల మంది మధుమేహ ముందు దశలో ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యతో ప్రస్తుతం భారతదేశం “మధుమేహ ప్రపంచ రాజధాని” గా మారింది. ఈ గణాంకాలు మధుమేహ వ్యాది తీవ్రతను, విస్తృతిని సూచిస్తాయి. పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల కంటే ఎక్కువ సంఖ్యను చూపుతున్నాయి. షుగరు ఒకసారి వస్తే దరిదాపుగా జీవితమంతా ఉంటుంది. షుగర్ వల్ల ఇబ్బంది పడ కుండా చూసుకోవాలి. షుగర్ అన్నది కుక్కలాంటిది. దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటే బొచ్చు కుక్క. జాగ్రత్త లేకుండా పెంచుకుంటే పిచ్చికుక్క. బొచ్చు కుక్కేమో తోకాడించుకుంటూ మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది పిచ్చికుక్కమో దాని ఇష్టం వచ్చినట్టు కొరికి పారేస్తుంది. అందుకే పిచ్చి కుక్కలా కాకుండా బొచ్చు కుక్కలాగా పెంచుకోవాలి. అలా జరగాలి అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు సరైనటువంటి జీవనరళి అలవర్చుకోవాలి. చెడు అలవాట్లు లేకుండా మంచి అలవాట్లను కలిగివుండాలి.ఆ అలవాట్లు ఏమిటో కింద చూద్దాం.

*వేళకు అన్నం తినాలి* ………

_____________________

వంట్లో షుగర్ ఎక్కువ ఉన్నా వెంటనే పెద్ద ప్రమాదం లేదు కానీ, షుగర్ తగ్గిపోతే గంటల్లోనే ప్రమాదం. అలా జరగకుండా ఉండాలంటే వేళకు తినాలి. ఆకలిగా ఉందని, రుచిగా ఉందని ఎక్కువ తినకూడదు. ఆకలిగా లేదని రుచిగా లేదని తక్కువ తినకూడదు. ఎక్కువ తింటే షుగర్ పెరుగుతుంది. తక్కువ తింటే షుగర్ తగ్గుతుంది.అలా జరగకుండా ఉండాలంటే సరైన సమయంలో, సరైన మోతాదులో ఆహారం తీసుకోవాలి.

*ఎత్తుకుతగిన బరువు ఉండాలి …..

..*
_______________________

ఊబకాయం ఉండకూడదు. ఊబకాయం అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. ఊబకాయాన్ని ఎప్పుడూ అదుపులో పెట్టుకోవాలి. ఎత్తుని సెంటీమీటర్లలో కొలుచుకుని అందులో నుంచి 100 తీసేస్తే ఎంత వస్తుందో అన్ని కేజీలు ఉండవచ్చు. అంటే 170 సెంటీమీటర్లు ఎత్తున్నవ్యక్తి 70 కేజీలు వుండవచ్చును.

*సరిపోయినంత నిద్రపోవాలి.* …….
_______________________.

శరీరానికి నిద్ర చాలా ముఖ్యం. శరీరంలో జరిగినటువంటి ఇబ్బందులకు రిపేర్ జరిగేది నిద్రలోనే. పగలు,రాత్రి కలిపి రోజుకు 8 గంటలు నిద్ర కావాలి. 6 గంటల కంటే తక్కువ నిద్ర, 10 గంటల కంటే ఎక్కువ నిద్ర రెండూ ప్రమాదమే. ప్రతిరోజూ అదే వేళకి నిద్రపోవడం మంచిది. సరిపోయినంత నిద్ర లేనప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి. షుగర్, బీపీలు అదుపు తప్పుతాయి. షుగర్ వల్ల వచ్చే సమస్యలు పెరుగుతాయి.

*జేబులో ఎప్పుడూ రెండు చాక్లెట్లు ఉంచుకోవాలి…….*
_______________________

ఎందుకంటే ఒంట్లో షుగర్ తగ్గితే మెదడు సరిగా పనిచేయక గంటల్లో స్పృహ కోల్పోయే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిలో వెంటనే రెండు స్పూన్ల గ్లూకోస్ పౌడర్ గాని రెండు స్పూన్ల చక్కెర గాని తీసుకుంటే 15 నిమిషాల్లో స్పృహలోకి వచ్చేస్తారు. ఇంట్లో ఉంటే చక్కెర తీసుకోగలం పొలంలో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు షుగర్ తగ్గితే అప్పుడు చక్కెర దొరకదు కదా? అందుకే షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్లినా ఎప్పుడూ రెండు స్పూన్లు చక్కెర గాని, రెండు చాక్లెట్లు గాని జేబులో ఉంచుకోవాలి. చక్కెరని జోబులో ఉంచుకోవడం కష్టం కదా! అందుకే షుగర్ ఉన్నవాళ్లు ఎప్పుడూ జేబులో రెండు చాక్లెట్లను తప్పకుండా ఉంచుకోవాలి. జేబులో చాక్లెట్ ఉంచుకుంటే వచ్చే ముఖ్యమైన ఇబ్బంది చాక్లెట్ లను తినాలని అనిపించడం. తినాలనిపించినా తినకూడదు. షుగర్ తగ్గినప్పుడు జరిగే అత్యవసర వైద్యానికి అవసరమైన మాత్రగా భావించి చాక్లెట్లు తినకుండా జోబులోనే ఉంచుకోవాలి.

*పడుకునేటప్పుడు పాదాలను, తొడుక్కునేటప్పుడు చెప్పులను పరీక్షించుకోవాలి. ……*
_______________________

షుగర్ ఎక్కువ కాలం ఉన్నటువంటి వాళ్లకు నరాలు దెబ్బతిని కాళ్లకు స్పర్శ తగ్గిపోతుంది. కాళ్లకు చీల గచ్చుకున్నా, ముల్లు గుచ్చుకున్నా నొప్పి తెలియకుండా నడుస్తూనే వుంటారు. కాలుకు బాగా చీము పట్టినప్పుడు తేరుకొని డాక్టర్ దగ్గరికి పోతుంటారు. అలా జరగకుండా ఉండాలంటే పాదాలకి ఏమైనా గాయమైందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి రోజూ పాదాలను ఎవరికివారు పరీక్షించుకోవాలి. పెద్ద వయసులో ఎవరి పాదాలను వాళ్ళు చూసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి భార్య పాదాలను భర్త, భర్త పాదాలను భార్య పరీక్ష చేసుకోవడం మంచిది. కొన్ని సందర్భాలలో చెప్పులో చీల గాని ముళ్ళు గాని. గుచ్చుకొని ఆ చీల కాళ్లకు గుచ్చుకుంటూనే ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే పొద్దున్నే తొడుక్కు నేటప్పుడు చెప్పులను పరీక్షించుకోవాలి. చెప్పులు లేకుండా తిరగకూడదు. వీలైతే ఇంట్లో కూడా చెప్పులేసుకునే తిరగాలి. వీలైతే బాత్రూం లో కూడా వేరే చెప్పులు ఉండాలి. ఎక్కడ చెప్పులు అక్కడే.

*_ధూమపానం, మద్యపానం, పొగాకు నమలడం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి…….._*


______________________

పొగ తాగితే షుగర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. షుగర్ ఉన్నటువంటి వాళ్లకి షుగర్ ద్వారా వచ్చే సమస్యలు చాలా ఎక్కువ అవుతాయి. పొగాకు సంబంధించిన పదార్థాలు వాడితే గుండెపోటు,పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాళ్ళకు రక్తం అందక కాళ్లు తీసివేయవలసిన పరిస్థితి రావచ్చు. అందుకే షుగర్ ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితులలో పాగాకు సంబంధిత పదార్థాలు వాడకూడదు.

*షుగర్ ఉన్నవాళ్లు షుగర్నే కాదు ఉప్పును కూడా తగ్గించుకోవాలి. …….*
________________”__’____

ఆచరించకపోయినప్పటికీ షుగర్ ఉన్నవాళ్లు షుగర్ తినకూడదని అందరికీ తెలుసు. షుగర్ ఉన్నవాళ్లు ఉప్పును కూడా తగ్గించుకోవాలని చాలామందికి తెలియదు. షుగర్ ఉన్న వాళ్ళకి అధిక రక్తపోటు (బీపీ) వచ్చే అవకాశం ఎక్కువ. బిపి ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే షుగర్ ఉన్నవాళ్లు చక్కెరతో పాటు ఉప్పుని కూడా తగ్గించుకోవాలి. బిపి ఉన్నవాళ్లు కూడా ఉప్పుతో పాటుచక్కెరను కూడా తగ్గించుకోవాలి. షుగరు, బిపి లేని వారు కూడా ఉప్పుని, చక్కెరని రెండింటిని తగ్గించుకోవడం మరీ మంచిది.

*_ప్రతిరోజు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి………._*

  1. బిబిఎన్________________’_’_’____

శారీరక వ్యాయామం చేయడం షుగరు అదుపులో ఉంచుకోవడానికి బాగా పనికొస్తుంది. షుగర్ వల్ల వచ్చే సమస్యను తగ్గించడానికి కూడా బాగా పనిచేస్తుంది. వ్యాయామం వల్ల రక్త ప్రసరణ మెరుగై గుండెపోటు, పక్షవాతం, కాళ్లు చెడిపోవడం లాంటి సమస్యల్ని బాగా తగ్గించుకోవచ్చు. శరీరంలోని జీవనక్రియలు అన్నీ మెరుగవడానికి అవకాశం ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది. రోజువారి శారీరక శ్రమ చేసే వాళ్ళకి వ్యాయామం అంత అవసరం లేదు. కానీ శారీరక శ్రమ లేని వారు మాత్రం కచ్చితంగా ప్రతిరోజు 1 గంట సమయాన్ని వ్యాయామం కోసం కేటాయించడం మంచిది.

*_షుగర్ ఉందన్న విషయం తన కుటుంబ సభ్యులకు తన సహ ఉద్యోగులందరికీ తెలిసి ఉండాలి. …._*
_______________________

మనకున్న జబ్బును పదిమందికి తెలియజేయడానికి భయపడతాం, గోప్యంగా ఉంచుతాం . షుగర్ ఉన్న వాళ్ళకి ఈ గోప్యత ఉండకూడదు. తనకు షుగర్ ఉందన్న విషయం తన సహ ఉద్యోగులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులందరికీ తెలిసి ఉండాలి. ఎందుకంటే షుగర్ ఉండి ఏదో సందర్భంలో షుగర్ తగ్గిపోయి, స్పృహ లేకుండా పోయినప్పుడు వెంటనే ప్రాథమిక వైద్యం చేయడానికి వీరందరూ పనికొస్తారు. ఎప్పుడైనా చమట పట్టి, స్పృహలో తేడా ఉందనిపిస్తే షుగర్ తగ్గిందని భావించి వెంటనే చక్కెర నోట్లో వేయవలెనని మిత్రులకు, సహ ఉద్యోగులకు, కుటుంబ సభ్యులందరికీ చెప్పుకొని ఉండాలి. వీరందరికి చెప్పుకొని ఉండడం ద్వారా షుగర్ తగ్గిన అత్యవసర పరిస్థితిలో ప్రాథమిక వైద్యం చేయడానికి, మిగిలిన వైద్యాన్ని అందించడం కోసం వైద్యుని దగ్గరికి ఆలస్యం లేకుండా తీసికెళ్ళడానికి ఉపయోగపడతారు. అందుకే మీకు షుగర్ ఉన్న విషయం మీ బంధుమిత్రులందరికి తెలియజెప్పి ఉండాలి.

*_స్థానాల గదిలో పాదాలకు రెండు నిమిషాలు కేటాయించాలి……..*_
______________________

షుగర్ వ్యాధిగ్రస్తులు పాదాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్ళను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. స్నానం చేసేటప్పుడు ఒళ్లంతా శుభ్రం చేసుకుంటాం కానీ పాదాలను మాత్రం పట్టించుకోం. స్నానం పూర్తయిన తర్వాత పాదాలను శుభ్రం చేసుకోవడానికి రెండు నిమిషాలు కేటాయించగలిగితే
కాళ్లు బాగా శుభ్రపడతాయి. కాళ్లకు వచ్చేటటువంటి సమస్యల్ని చాలా వరకు తగ్గించుకోగలం. కాళ్ళని ఊరకనే రుద్దడం కాకుండా కాళ్ళ కోసం ఓ ప్రత్యేకమైన రాయి అందుబాటులో ఉంది. దానిని ప్యూమిక్ స్టోన్ అంటారు. ఆ రాళ్లతో పాదం మొత్తాన్ని రుద్దుకోగలిగితే పాదాలకున్న గట్టిదనం పోయి కాలు మృదువుగా, ఆరోగ్యకరంగా ఉంటుంది .అందుకే స్నానాల గదిలో కనీసం రెండు నిమిషాలు పాదాలకు కేటాయించడం మంచిది.‌

*_ఎప్పుడూ చెప్పులు వేసుకునే ఉండాలి._ ……*_
_____________________

ఎక్కువ కాలం షుగర్ ఉండే వాళ్ళకి స్పర్శ తగ్గిపోతున్న కారణంగా చిన్న గాయాలు కూడా సరిగా తెలియకుండా ఉంటాయి. కాబట్టి చెప్పులు లేకుండా నడవకూడదు. ఇంట్లో కూడా చెప్పులేసుకోవడం మంచిది. బాత్రూంలో కూడా చెప్పులేసుకుంటే ఇంకా మంచిది. ఇంట్లో చెప్పులు ఇంట్లో, బయట చెప్పులు బయట ఉండేటట్టుగా రెండు జతలు వాడుకోవడం మంచిది.

ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే షుగర్ అన్నది జీవిత కాలం పాటు ఉన్నా దానివల్ల వచ్చే సమస్యలన్నిటిని దరిదాపుగా అదుపులో పెట్టగలిగిన పరిస్థితి ఉంటుంది. చివరిగా ఒక్క మాట “నోరు అదుపులో ఉంటే షుగర్ అదుపులో ఉంటుంది”.

డాక్టర్ ఎం.వి. రమణయ్య ప్రజారోగ్య వేదిక
రాష్ట్ర అధ్యక్షుడు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.