*80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
ఏన్కూరు మండల ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏన్కూరు పోలీస్స్టేషన్ ఎస్హెచ్ఓ ఎన్. సంధ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి పౌరుడు తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. దేశభక్తి, ఐక్యత, శాంతి, సోదరభావం, సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవాలని కోరారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్హెచ్ఓ సంధ్య విజ్ఞప్తి చేశారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా, దేశభక్తి భావంతో జరుపుకోవాలని ఆమె కోరారు.


