80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకి , బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, గల్లా సత్య నారాయణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
దేశ స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండా కేవలం ఒక పతాకం మాత్రమే కాదని, అది దేశ గౌరవానికి, స్వాతంత్ర్యానికి, ఐక్యతకు ప్రతీక అని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని గల్లా సత్యనారాయణ ఆకాంక్షించారు. దేశ ఐక్యత, సమగ్రత, శాంతి, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని, భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.



