Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

4 వార్డు సభ్యునిగా పోటీ చేస్తున్న యువ నాయకుడు,ఎస్. మనోజ్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
4 వార్డు సభ్యునిగా పోటీ చేస్తున్న యువ నాయకుడు,ఎస్. మనోజ్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • గౌను గుర్తుకే మీ అమూల్యమైన ఓటు బత్తులవల్లం గ్రామ 4వ వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
  • మన వార్డు అభివృద్ధే నా ఏకైక లక్ష్యం.
  • గ్రామంలో పుట్టి, గ్రామంలో పెరిగిన వాడిగా మన వార్డులో ఉన్న ప్రతి సమస్య నాకు తెలుసు.

గౌను గుర్తుకే మీ అమూల్యమైన ఓటు
బత్తులవల్లం గ్రామ 4వ వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
మన వార్డు అభివృద్ధే నా ఏకైక లక్ష్యం. గ్రామంలో పుట్టి, గ్రామంలో పెరిగిన వాడిగా మన వార్డులో ఉన్న ప్రతి సమస్య నాకు తెలుసు. రోడ్లు, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం, మురుగునీటి నిర్వహణ, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలను పరిష్కరించడమే నా ప్రధాన ధ్యేయం.
నా ప్రధాన లక్ష్యాలు:
1. వార్డు అభివృద్ధి:4వ వార్డును గ్రామంలోనే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతాను.
2. మౌలిక వసతుల కల్పన: ప్రతి ఇంటికి త్రాగునీరు, ప్రతి వీధికి రోడ్డు సౌకర్యం కల్పిస్తాను.
3. శుభ్రత, మురుగునీటి నిర్వహణ: వార్డును ఎప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటాను.
4. రోడ్లు, వీధి దీపాల అభివృద్ధి: చీకటి లేని వార్డుగా, రోడ్లు లేని వీధి లేకుండా చేస్తాను.
నేను గెలిచిన తర్వాత కాదు, గెలవక ముందు నుంచే మీ మధ్యనే ఉంటాను. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాను. పెద్దల ఆశీస్సులు, యువత సహకారం, మహిళల ఆదరణతో మన వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తాను.
ఎన్నికల బ్యాలెట్ పత్రంలో *రెండవ వరుసలో* ఉండే *గౌను గుర్తు*కు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని 4వ వార్డు ప్రజలందరినీ వినయంగా కోరుతున్నాను.
మీ సేవలో…
మనోజ్ కుమార్
4వ వార్డు అభ్యర్థి, బత్తులవల్లం గ్రామ పంచాయతీ
గుర్తు: గౌను

Leave a comment

Your email address will not be published. Required fields are marked *