మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటి పరిధిలోని 22వ వార్డులో రూ.15 లక్షల యూఐడీఎఫ్ నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పీక ఎల్లబాయ్, కాంగ్రెస్ నాయకులు కంకటి శ్రీనివాస్, పీక లక్ష్మణ్, నీలీకృష్ణ తదితరులు పాల్గొన్నారు




