బద్రాద్రి .కొత్తగూడెం జూలై.27. (పున్నమి వార్తలు)
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 16 వ డివిజన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలిముద్ద- బాల భరోసా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.15,18,19 అంగన్వాడీ సెంటర్లలో తొలిముద్ద – బాల భరోసా కార్యక్రమాన్ని 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ చిన్నారులకు తొలిముద్దను వడ్డించి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉండకుండా వారి ఎదుగుదలలో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలని ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లలోని చిన్నపిల్లలకు గోధుమ రవ్వ లో అన్ని రకాల పప్పులు , పల్లీలు మొదలైన ప్రోటీన్ సహిత ఆహారాన్ని అందించాలని ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని ఆమె తెలిపారు. పిల్లలకి అందించే పౌష్టికాహారంలో కాంట్రాక్టర్ నాణ్యత లోపం లేకుండా ముడి పదార్థాన్ని అందించాలని, ఆ బాధ్యతను అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ సూపర్వైజర్లు, ఉన్నత అధికారులు చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆమె అన్నారు. 15, 18, 19 సెంటర్ల టీచర్లు ఎన్ సరోజ, ది నీలవేణి, షహనాజ్ బేగం,ఆయమ్మ వెంకటలక్ష్మి చిన్నారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



