వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ (పున్నమి న్యూస్ రిపోర్టర్ )..
- పామూరు పట్టణం లోనే కాక మండల స్థాయిలో కూడా పరిచయం వున్న వ్యక్తి,, సయ్యద్ రజియా బేగం..
- గత కొన్ని సంవత్సరాలుగా, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, పార్టీ పటిష్టం చేసే విధంగా రజియా సయ్యద్ ప్రయాణం సాగింది..
పామూరు, నవంబర్ (పున్నమి న్యూస్ రిపోర్టర్ ).. పామూరు పట్టణం లోనే కాక మండల స్థాయిలో కూడా పరిచయం వున్న వ్యక్తి,, సయ్యద్ రజియా బేగం.. గత కొన్ని సంవత్సరాలుగా, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, పార్టీ పటిష్టం చేసే విధంగా రజియా సయ్యద్ ప్రయాణం సాగింది.. అంతేకాక స్థానిక యం. యల్. ఏ. ఆదేశాలతో, ఎన్నో మహిళా సాధికారక కల్గిన పధకాలు అమలు చేసి, యం. యల్. ఏ. ఉగ్ర నరసింహ రెడ్డి దగ్గర వుండే క్యాడర్లో ఒకరిగా పేరుపొందిన మహిళా అధ్యక్షులు రజియా సయ్యద్..
. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి గెలుపులో కీలక పాత్ర!!!!!
. ప్రభుత్వ సంక్షేమ పథకాలే గెలుపు లక్ష్యంగా ముందడుగు!!!
. స్థానికురాలిగా ప్రజలతో విడదీయరాని బంధం!!!!!
పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పామూరు గ్రామ పంచాయతీ 14వ వార్డు మెంబర్ అభ్యర్థిగా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలుగుదేశం పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. స్థానికంగా ప్రజలతో ఉన్న సత్సంబంధాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులే తనను విజయ తీరాలకు చేరుస్తాయని ఆమె ధీమా వ్యక్తంచేశారు.
ఎమ్మెల్యే గెలుపులో కీలక పాత్ర…!!!!
2024 శాసనసభ ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహ రెడ్డి అఖండ విజయం కోసం రజియా సయ్యద్ అహర్నిశలు శ్రమించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, గెలుపులకు ఆమె పోషించిన కీలకపాత్రను పార్టీ శ్రేణులు, ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు.
ఇంటింటి ప్రచారంలో చురుగ్గా…
ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి సీఎం ప్రవేశపెట్టిన వినూత్న సంక్షేమ పథకాలు, పామూరులో జరుగుతున్న అభివృద్ధి పనులను రజియా సయ్యద్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. 14 వ వార్డులో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ లబ్ధిని వివరిస్తూ ప్రచార కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటున్నారు.
స్థానికురాలిగా ప్రజల గుండెల్లో స్థానం….
రజియా సయ్యద్ స్థానికురాలు కావడంతో వార్డులోని ఓటర్లతో, ఆయా కుటుంబాలతో ఆమెకు విడదీయరాని సత్సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి కష్టసుఖాలో భాగస్వామి అవుతూ, అందరికీ అందుబాటులో ఉండే నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 14వ వార్డు ప్రజలు సైతం ఆమె పట్ల సానుకూలంగా ఉన్నారని, అధిష్టానం కనుక అవకాశం ఇస్తే రజియా సయ్యద్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని స్థానిక ఓటర్లు, ముఖ్యంగా మహిళలు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.