Monday, 28 September 2026
  • Home  
  • వంద మంది దివ్యాంగులకు ఉచిత కొలతల శిబిరం
- తూర్పు గోదావరి

వంద మంది దివ్యాంగులకు ఉచిత కొలతల శిబిరం

పున్నమి న్యూస్ ప్రతినిది కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గము తాళ్లపూడి మండల కేంద్రంలో దేవోక్తి ఛారిటబుల్ ట్రస్ట్ (చిడిపి) ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం ఉచిత కొలతల శిబిరాన్ని నిర్వహించారు. ‘సమాజమే మా కుటుంబం’ అనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం తాళ్లపూడిలోని డాక్టర్ మూర్తి ఆసుపత్రి- మంగన్న సర్జికల్ అండ్ మెటర్నిటీ నర్సింగ్ హోమ్ నందు జరిగింది. ఈ శిబిరంలో సుమారు వంద మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాల కోసం కొలతలు తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన వైద్యుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వారికి, పోలియో బాధితులకు వారి అవసరాలను బట్టి ఖచ్చితమైన కొలతలు తీసుకున్నారు. వీరికి సాఫ్ట్ లైనర్ తో కూడిన జైపూర్ లెగ్స్, కాలిపర్స్ ఉచితంగా తదితరాలను పూర్తిగా అందించనున్నారు. దాతల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా, కొలతలు ఇచ్చిన వారికి నెల రోజుల లోపు కృత్రిమ అవయవాలను అమర్చుతామని నిర్వాహకులు తెలిపారు. ‘దివ్యాంగులను నడిపించే మనస్సు, వారి చిరునవ్వే మా సంస్థ లక్ష్యం’ అని ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని డాక్టర్ మూర్తి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవోక్తి ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ ప్రత్తిపాటి నాగరాజు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు జోడాల వెంకటేశ్వరరావు, మణిమెల అంకబాబు, రామంచ ప్రవీణ్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

పున్నమి న్యూస్ ప్రతినిది కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గము తాళ్లపూడి మండల కేంద్రంలో దేవోక్తి ఛారిటబుల్ ట్రస్ట్ (చిడిపి) ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం ఉచిత కొలతల శిబిరాన్ని నిర్వహించారు. ‘సమాజమే మా కుటుంబం’ అనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం తాళ్లపూడిలోని డాక్టర్ మూర్తి ఆసుపత్రి- మంగన్న సర్జికల్ అండ్ మెటర్నిటీ నర్సింగ్ హోమ్ నందు జరిగింది. ఈ శిబిరంలో సుమారు వంద మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాల కోసం కొలతలు తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన వైద్యుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వారికి, పోలియో బాధితులకు వారి అవసరాలను బట్టి ఖచ్చితమైన కొలతలు తీసుకున్నారు. వీరికి సాఫ్ట్ లైనర్ తో కూడిన జైపూర్ లెగ్స్, కాలిపర్స్
ఉచితంగా తదితరాలను పూర్తిగా అందించనున్నారు. దాతల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా, కొలతలు ఇచ్చిన వారికి నెల రోజుల లోపు కృత్రిమ అవయవాలను అమర్చుతామని నిర్వాహకులు తెలిపారు. ‘దివ్యాంగులను నడిపించే మనస్సు, వారి చిరునవ్వే మా సంస్థ లక్ష్యం’ అని ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని డాక్టర్ మూర్తి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవోక్తి ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ ప్రత్తిపాటి నాగరాజు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు జోడాల వెంకటేశ్వరరావు, మణిమెల అంకబాబు, రామంచ ప్రవీణ్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.