0 బిల్లు నుంచి ఒక్కసారిగా ₹1705..!
విద్యుత్ వినియోగదారుడికి భారీ షాక్..!
మే నెల కరెంట్ బిల్లు చూసి అవాక్కైన కుటుంబం
అధికారుల నిర్లక్ష్యమా..? మీటర్ లోపమా..? అంటూ ఆవేదన
పున్నమి న్యూస్
10 జూన్ 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీ పరిధిలో ఓ విద్యుత్ వినియోగదారుడికి మే నెల కరెంట్ బిల్లు భారీ షాక్ ఇచ్చింది. గతంలో 0 బిల్లు వస్తుండగా, ఈసారి ఒక్కసారిగా ₹1705 కరెంట్ బిల్లు రావడంతో వినియోగదారుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ వినియోగదారుడు ఇంట్లో పెద్దగా విద్యుత్ పరికరాలు ఉపయోగించకపోయినా ఇంత భారీ మొత్తం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతంలో సున్నా బిల్లు వచ్చిన ఇంటికి ఒక్కసారిగా ఇంత అధిక బిల్లు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మీటర్ రీడింగ్‌లలో పొరపాట్లు, అంచనా బిల్లులు, సాంకేతిక సమస్యలు ఎక్కువవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు సరైన పరిశీలన లేకుండా బిల్లులు జారీ చేస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు.
“రోజువారీ కూలి చేసి కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉంది. అలాంటి సమయంలో ఒక్కసారిగా ₹1705 బిల్లు రావడం మాకు తీవ్ర భారంగా మారింది” అని బాధిత వినియోగదారుడు కన్నీటి పర్యంతమయ్యాడు.
సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి మీటర్‌ను తనిఖీ చేసి సరైన బిల్లు జారీ చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పేద, మధ్యతరగతి ప్రజలపై అధిక విద్యుత్ బిల్లుల భారం మోపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
“0 బిల్లు నుంచి ₹1705కి ఎలా..?
వినియోగదారుడికి షాక్ ఇచ్చిన విద్యుత్ బిల్లు”
ఈ ఘటన ప్రస్తుతం మేడిపల్లి నక్కర్త గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.





