విశాఖపట్నం, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి) ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) పిలుపులో భాగంగా ఏపీయూడబ్ల్యూజే, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలో జర్నలిస్టులు ‘డిమాండ్స్ డే’ నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు రక్షణ కమిటీ, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, 58 ఏళ్ల నుంచి పెన్షన్, అర్హత ఉన్నవారికి అక్రిడిటేషన్లు, రైల్వే రాయితీ పునరుద్ధరణ, అక్రమ కేసుల నివారణ వంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావులవలస రామచంద్రరావు, ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా అధ్యక్షులు కే. రాము, మనభూమి సత్యనారాయణతో పాటు కె. చంద్రమోహన్, కె. పరశురాం, పి. రామకృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.




