Thursday, 1 October 2026
  • Home  
  • మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి బ్యాంకు లింకేజీ రుణాలు జీవనోపాధి కార్యకలాపాల విస్తరణకు కోటి రూపాయల రుణ ప్రణాళిక ప్రతిపాదనలు _ ఏపీఎo ఆంజనేయులు
- కడప

మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి బ్యాంకు లింకేజీ రుణాలు జీవనోపాధి కార్యకలాపాల విస్తరణకు కోటి రూపాయల రుణ ప్రణాళిక ప్రతిపాదనలు _ ఏపీఎo ఆంజనేయులు

(పున్నమి ప్రతినిధి) వేముల మండలం, అక్టోబర్ 1: వేముల మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు (SHGs) బ్యాంకు లింకేజీ ద్వారా పొందే రుణాలను సద్వినియోగం చేసుకుని జీవనోపాధి కార్యకలాపాలను విస్తరించుకోవాలని వెలుగు డీఆర్‌డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం) ఆంజనేయులు సూచించారు. సంఘాల ఆర్థిక స్వావలంబనకు బ్యాంకు లింకేజీ రుణాలు కీలక వనరుగా ఉపయోగపడతాయని తెలిపారు. జీవనోపాధి కార్యకలాపాల విస్తరణకు కోటి రూపాయల రుణ ప్రణాళిక ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. సభ్యుల నైపుణ్యాలు, స్థానిక వనరులు, మార్కెట్ అవకాశాలను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, సూక్ష్మ వ్యాపారాలు, ఇతర ఆదాయ వనరులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రుణాలను ఉత్పాదక ప్రయోజనాలకు వినియోగిస్తూ ఆదాయం–వ్యయ వివరాలను క్రమబద్ధంగా నమోదు చేయాలని తెలిపారు. రుణాలను సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా క్రెడిట్ డిసిప్లిన్‌ను బలోపేతం చేసుకోవాలని, బ్యాంకు ఖాతాలు, రుణ వివరాలు, చెల్లింపులు, ఇతర ఆర్థిక రికార్డులను పారదర్శకంగా నిర్వహించాలని ఆంజనేయులు సూచించారు. రుణ వినియోగం, చెల్లింపులను విలేజ్ ఆర్గనైజేషన్ స్థాయిలో పర్యవేక్షించాలని, అవసరమైన మార్గదర్శకత్వాన్ని CCలు, VOAలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్లు జ్యోతి, జయపాల్, నాగేశ్వరి, గంగ, రాజు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

(పున్నమి ప్రతినిధి)
వేముల మండలం, అక్టోబర్ 1:
వేముల మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు (SHGs) బ్యాంకు లింకేజీ ద్వారా పొందే రుణాలను సద్వినియోగం చేసుకుని జీవనోపాధి కార్యకలాపాలను విస్తరించుకోవాలని వెలుగు డీఆర్‌డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం) ఆంజనేయులు సూచించారు. సంఘాల ఆర్థిక స్వావలంబనకు బ్యాంకు లింకేజీ రుణాలు కీలక వనరుగా ఉపయోగపడతాయని తెలిపారు. జీవనోపాధి కార్యకలాపాల విస్తరణకు కోటి రూపాయల రుణ ప్రణాళిక ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

సభ్యుల నైపుణ్యాలు, స్థానిక వనరులు, మార్కెట్ అవకాశాలను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, సూక్ష్మ వ్యాపారాలు, ఇతర ఆదాయ వనరులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రుణాలను ఉత్పాదక ప్రయోజనాలకు వినియోగిస్తూ ఆదాయం–వ్యయ వివరాలను క్రమబద్ధంగా నమోదు చేయాలని తెలిపారు.

రుణాలను సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా క్రెడిట్ డిసిప్లిన్‌ను బలోపేతం చేసుకోవాలని, బ్యాంకు ఖాతాలు, రుణ వివరాలు, చెల్లింపులు, ఇతర ఆర్థిక రికార్డులను పారదర్శకంగా నిర్వహించాలని ఆంజనేయులు సూచించారు. రుణ వినియోగం, చెల్లింపులను విలేజ్ ఆర్గనైజేషన్ స్థాయిలో పర్యవేక్షించాలని, అవసరమైన మార్గదర్శకత్వాన్ని CCలు, VOAలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్లు జ్యోతి, జయపాల్, నాగేశ్వరి, గంగ, రాజు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.