Wednesday, 30 September 2026
  • Home  
  • మల్లాం బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. వేడి సాంబారు పడి 12 మందికి గాయాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మల్లాం బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. వేడి సాంబారు పడి 12 మందికి గాయాలు

నెల్లూరు: చిట్టమూరు మండలం మల్లాంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. కళ్యాణోత్సవం నేపథ్యంలో భక్తుల కోసం భారీ అన్నదానం ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదం జరిగింది. అన్నదానం కోసం పెద్ద పాత్రలో సాంబారు వండుతున్న సమయంలో ప్రమాదవశాత్తు పాత్ర ఒలిగి, వేడి సాంబారు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై పడింది. ఈ ఘటనలో మొత్తం 12 మందికి గాయాలైనట్లు సమాచారం. వెంటనే స్థానికులు, ఆలయ సిబ్బంది గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించినట్లు తెలుస్తోంది. ఘటనపై ఆలయ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో కలకలం నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.