Wednesday, 30 September 2026
  • Home  
  • వెలగని వీధిలైట్లు.. పేరుకుపోయిన చెత్త! పౌర సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: KMC అదనపు కమిషనర్ కి బీఆర్‌ఎస్ నాయకుల వినతి పత్రం.
- ఖమ్మం

వెలగని వీధిలైట్లు.. పేరుకుపోయిన చెత్త! పౌర సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: KMC అదనపు కమిషనర్ కి బీఆర్‌ఎస్ నాయకుల వినతి పత్రం.

ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో నెలల తరబడి వీధిలైట్లు వెలగకపోవడం, పారిశుధ్య సమస్యలు పేరుకుపోవడంపై బీఆర్‌ఎస్‌ నగర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మూడు, నాలుగు నెలలుగా పలు డివిజన్లలో వీధిలైట్లు పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పాడైన లైట్లకు మరమ్మతులు చేయడం లేదా కొత్తవి ఏర్పాటు చేయడం లేదని తెలిపారు. చెత్త, మురుగు పేరుకుపోవడంతో దోమల బెడద పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వర్షాకాలంలో పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హయాంలో అధికారులు, ప్రజలతో కలిసి నగరంలో పర్యటించి సమస్యలు పరిష్కరించేవారని గుర్తుచేశారు. పౌర సేవలు మెరుగుపడకపోతే ప్రజల తరఫున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమం లొ మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కూమర్ లతో పాటు పలువురు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో నెలల తరబడి వీధిలైట్లు వెలగకపోవడం, పారిశుధ్య సమస్యలు పేరుకుపోవడంపై బీఆర్‌ఎస్‌ నగర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మూడు, నాలుగు నెలలుగా పలు డివిజన్లలో వీధిలైట్లు పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పాడైన లైట్లకు మరమ్మతులు చేయడం లేదా కొత్తవి ఏర్పాటు చేయడం లేదని తెలిపారు. చెత్త, మురుగు పేరుకుపోవడంతో దోమల బెడద పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వర్షాకాలంలో పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హయాంలో అధికారులు, ప్రజలతో కలిసి నగరంలో పర్యటించి సమస్యలు పరిష్కరించేవారని గుర్తుచేశారు. పౌర సేవలు మెరుగుపడకపోతే ప్రజల తరఫున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమం లొ మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి
పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కూమర్ లతో పాటు పలువురు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.